
📌 Key Points
- నటుడు జీవన్ కుమార్ యాంకర్ స్రవంతి చెప్పులపై సరదా వ్యాఖ్యలు చేశారు.
- స్రవంతి ధరించిన బ్యాలెన్సియాగా చెప్పుల ధర రూ.85,000 అని వెల్లడి.
- ముంబైకి వెళ్లి ప్రత్యేకంగా కొనుగోలు చేసిన స్రవంతి.
- చిన్న యాంకర్‌కు ఇంత ఖరీదైన చెప్పులా అని నెటిజన్ల ఆశ్చర్యం.
యాంకర్ స్రవంతి చొక్కారపు ధరించిన చెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గుర్రం రాపి రెడ్డి సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు జీవన్ కుమార్ వాటి ధర రూ.85 వేలని వెల్లడించడంతో నెటిజన్లు షాకయ్యారు. బ్యాలెన్సియాగా బ్రాండ్ చెప్పుల గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.
యాంకర్ స్రవంతి చెప్పులపై జీవన్ కుమార్ వ్యాఖ్యలు
Sravanthi Chokkarapu: ఆ మధ్య మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఓ ఈవెంట్ లో వేసుకొచ్చిన బలెన్సియాగ బ్రాండ్ చెప్పులు ఎంత హాట్ టాపిక్ అయ్యాయో తెలిసిందే . స్టేజ్ పైకి వచ్చిన విశ్వక్ సేన్ ని యాంకర్ సుమ డ్యాన్స్ వేయమని అడిగితే .. అప్పుడు తన షూ చూపించిన తాను డ్యాన్స్ వేయలేనని చెప్పాడు . అయితే అప్పుడు అతడి షూ చూసి అంత ఆశ్చర్యపోయారు . వెరైటీ డిజైన్ తో భారీగా కనిపించాయి . వాటిని చూసి ఇవేంటి అంతలా ఉన్నాయి .. ఇవి షూ హా .. అలమారానా ? అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది .
దీంతో విశ్వక్ షూ గురించే అంత చర్చించుకున్నారు . ఇక వీటి ధర తెలిసి అంత అవాక్కాయ్యారు . అయితే ఇప్పుడు అదే బ్రాండ్ చెప్పులను ధరించి మరో సెలబ్రిటీ వార్తల్లో నిలిచారు . ఆమె మరెవరో కాదు యాంకర్ స్రవంతి చొక్కారపు . ఈ చిన్న యాంకరమ్మ ఇంత పెద్ద బ్రాండ్ చెప్పులు కొనడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది . అంతేకాదు ఆమె చెప్పులపై నటుడు జీవన్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . గుర్రం రాపి రెడ్డి సాంగ్ లాంచ్ ఈవెంట్ కి స్రవంతి చొక్కారపు యాంకర్ గా వ్యవహరించింది . ఈ కార్యక్రమంలో మూవీ హీరోహీరోయిన్ తో పాటు డైరెక్టర్ , నిర్మాత , నటుడు జీవన్ రెడ్డి పాల్గొన్నారు .
విశ్వక్ సేన్ తర్వాత బ్యాలెన్సియాగా చర్చ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ‘ యాంకర్ స్రవంతి చెప్పులపై ఫన్నీ కామెంట్స్ చేశారు . నాకు చాలా బాధగా ఉంది . యాంకర్ చెప్పులు చూస్తే నాకేందుకో బాధగా అనిపిస్తుంది . ఈవెంట్ అనగానే ఇంట్లో ఉన్న ఏవో చెప్పులు వేసుకుని వచ్చాను . కానీ , ఈ వెంట్ కోసం యాంకర్ గారు ముంబై వెళ్లి మరి చెప్పులు కొనుక్కుని వచ్చారు . ఆమె చెప్పుల ధర రూ . 85 వేలు . బలెన్సియాగ బ్రాండ్ అవి . లాస్ట్ వీక్ ముంబైకి ప్లైయిట్ లో వెళ్లి మరి చెప్పులు కొన్నారు . దీనిబట్టి తెలుస్తుంది . మా నిర్మాత అంత భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు ‘ అని చెప్పుకొచ్చారు . ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఓ చిన్న యాంకరైన స్రవంతి ఇంత బ్రాండ్ చెప్పులు కొనడం ఏంటని నెటిజన్స్ అవాక్క్ అవుతున్నారు .
85 వేల చెప్పుల ప్రత్యేకత ఏంటి?
ఆ చెప్పులో ఏముందని , నార్మల్ క్రాక్స్ మాదిరిగానే ఉన్నాయి కదా .. అంత ధరేంటి ? అని అంతా చర్చించుకుంటున్నారు . మరి ఈ చెప్పలు బ్రాండ్ ఏంటి ? వాటి ప్రత్యేకత ఏంటో చూద్దాం ! కాగా బలెన్సియాగ. ఇది 104 ఏళ్ల క్రితం స్పెయిన్‌లో పుట్టిన లగ్జరీ బ్రాండ్. ప్రస్తుతం ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ గూడ్స్ సంస్థ కెరింగ్ దీన్ని నడిపిస్తోంది. ఈ సంస్థకు చాలా దేశాల్లో బోటిక్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కూడా లగ్జరీ గూడ్స్‌ను విక్రయిస్తోంది. బలెన్సియాగ హార్డ్‌క్రాక్స్. రబ్బర్‌తో తయారు చేసిన మ్యూల్ సాండిల్స్ ఇవి. వీటిని తయారు చేసేది ఫ్రెంచ్ కంపెనీనే అయినా.. ఇవి తయారయ్యేది మాత్రం చైనాలో. ప్రస్తుతం ఆన్ లైన్ లో వీటి ధర రూ 795 డాలర్లు అంటే ( ఇండియన్ కరెన్సీలో రూ.72 వేలు ) రూ . 75 వేల ఈ క్రాక్స్ ప్రస్తుతం ఆఫర్లలో రూ . 45 వేలకు అందుబాటులో ఉన్నాయి .
యాంకర్ స్రవంతి చెప్పుల ధరపై నెటిజన్లలో ఇంకా చర్చ జరుగుతోంది. బ్యాలెన్సియాగా వంటి లగ్జరీ బ్రాండ్‌ను చిన్న యాంకర్ ధరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ చెప్పుల వెనుక ఉన్న కథ, వాటి ప్రత్యేకత గురించి ఆసక్తి నెలకొంది.


