
యూట్యూబ్ షో ద్వారా పేరు తెచ్చుకున్న అనిల్ గీలా, తన తొలి ఓటీటీ సిరీస్ ‘మోతెవరి లవ్ స్టోరీ’ విజయంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌కు లభించిన మద్దతును, భవిష్యత్తు ప్రణాళికలను వివరించాడు.
Key Points
అనిల్ గీలా 'మోతెవరి లవ్ స్టోరీ' ఓటీటీ సిరీస్ హీరోగా సక్సెస్ అందుకున్నాడు.
లాంగ్ డ్రైవ్ సంస్థ ఉచితంగా కార్లు అందించింది.
'మై విలేజ్ షో' టీం సహకారంతో ఈ సిరీస్ సాధించిన విజయం.
వచ్చే పదేళ్లలో మరింత ఎత్తులకు ఎదగాలని ఆకాంక్ష.
మోతెవరి లవ్ స్టోరీ విజయం
యూట్యూబ్‌లో మై విలేజ్ షో సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసింది. అందులోని బిగ్ బాస్ గంగవ్వతోపాటు అనిల్ గీలా ఎంతో పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో నటుడిగా చేసిన అనిల్ గీలా ఓటీటీ వెబ్ సిరీస్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెబ్ సిరీసే మోతెవరి లవ్ స్టోరీ.
ఆగస్ట్ 8 నుంచి జీ5లో మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ కామెడీగా తెరకెక్కిన మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్‌కు ముందు మెగా ప్రీవ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మోతెవరి లవ్ స్టోరీ లోని 4 ఎపిసోడ్స్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హీరో అనిల్ గీలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అనిల్ గీలా మాట్లాడుతూ .. “మా జర్నీ 8 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ స్థాయికి వస్తామని నేను అయితే అనుకోలేదు. శ్రీకాంత్ అన్న చెప్పినట్టుగా వచ్చే పదేళ్లలో ఆ స్థాయిలో ఉంటాం. తెరపై మా బొమ్మని చూసుకుంటే ఆనందంగా ఉంది. అందరం ప్రేమతో ఈ ప్రాజెక్ట్‌ని చేశాం” అని అన్నాడు.
లాంగ్ డ్రైవ్ సంస్థ సహకారం
“తీసుకున్న బడ్జెట్‌కి ఇచ్చిన అవుట్ పుట్‌కు జీ5 టీం సంతృప్తికరంగా ఉంది. మేం కన్న కలకు అందరం ఆయుధంగానే పని చేశాం. శివన్న ప్రతీ చిన్న డీటైల్‌ను మిస్ కాకుండా చూసుకునేవారు. మా అందరికీ ఇది మొదటి ప్రాజెక్ట్. మా శివన్నతో సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తాం” అని అనిల్ గీలా తెలిపాడు.
“మా ‘ మై విలేజ్ షో ’ టీంను మరింత ముందుకి తీసుకెళ్తాం. శ్రీకాంత్, శివన్న, నేను ముగ్గురం త్రిమూర్తుల్లా పని చేశాం. ఎక్కడా క్వాలిటీ తగ్గొద్దు అని శ్రీకాంత్ అన్న చాలా కష్టపడ్డారు. చరణ్ అన్న తన మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. ఆయన ఆర్ఆర్ వల్లే చాలా మంది ఏడ్చేశారు. హరి ప్రియ క్యాస్టూమ్స్ అద్భుతంగా కుదిరాయి” అని అనిల్ గీలా చెప్పాడు.
అనిల్ గీలా భవిష్యత్తు ప్రణాళికలు
“మా కోసం లాంగ్ డ్రైవ్ సంస్థ కార్లను ఉచితంగా ఇచ్చింది. మమ్మల్ని ముందుండి నడిపించిన మధుర శ్రీధర్ అన్నకి థాంక్స్. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన నా భార్య ఆమనికి థాంక్స్. మా లాంటి కొత్త వారికి మీడియా సపోర్ట్ ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను” అనిల్ గీలా పేర్కొన్నాడు.
“చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సకుటుంబ సమేతంగా అందరూ కూర్చుని హాయిగా చూసుకునేలా మా సిరీస్ ఉంటుంది. ఆగస్ట్ 8న మా సిరీస్ జీ5లో రాబోతోంది. అందరూ చూడండి” అని కోరాడు ఓటీటీ సిరీస్ హీరో అనిల్ గీలా.
మొత్తం మీద, అనిల్ గీలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ విజయంతో సంతోషంగా ఉన్నాడు. భవిష్యత్తులో మరింత మంచి పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నాడు.


