|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా షాక్: ఒకే ఫ్రేమ్‌లో చిరు, పవన్, చరణ్.. డైరెక్టర్ ఎవరంటే?

Published: 15-01-2026, 6:16 AM
మెగా షాక్: ఒకే ఫ్రేమ్‌లో చిరు, పవన్, చరణ్.. డైరెక్టర్ ఎవరంటే?
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ నటించే అవకాశం!
  • సంక్రాంతి రిలీజ్‌కు టార్గెట్‌గా షార్ట్ టైమ్‌లో సినిమా చేసేందుకు సన్నాహాలు!
  • కేవలం 25 రోజుల్లో ‘మన శంకర వర ప్రసాద్’ స్క్రిప్ట్ పూర్తి చేసిన అనిల్ రావిపూడి!
  • మెగా అభిమానులకు పండుగలాంటి వార్త: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు మెగాస్టార్లు!

టాలీవుడ్‌లో సెన్సేషనల్ న్యూస్! అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లతో సినిమా చేసే బంపర్ ఆఫర్ వచ్చిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అనిల్ రావిపూడికి మెగా ఆఫర్?

Anil Ravipudi : పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు.. ఇలా వరుస విజయాలు. మూడు హ్యాట్రిక్స్‌ కొట్టిన సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకుని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనిల్, వచ్చే సంక్రాంతికి కూడా ఇప్పటినుంచే రెడీ అవుతున్నాడట.

మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్‌ స్టోరీతో కుటుంబంతో సహా సినిమాలు చూసేలా మూవీస్‌ తీయటం అనిల్ స్టైల్‌. ఆడియన్స్‌ కూడా ఆయన మార్క్‌ స్టోరీ లైనప్‌కు, కామెడీకి ఫిదా అవుతున్నారు. అందుకే ప్రతి స్టార్ హీరో కూడా అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారుట.

సంక్రాంతికి ముగ్గురు మెగాస్టార్లు?

తక్కువ టైమ్‌లో ఫాస్ట్‌గా సినిమా చేసి హిట్ కొడుతున్న అనిల్ రావిపూడికి ఇంకో బంఫర్ ఆఫర్ వచ్చినట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. మెగా కాంబో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌, రామ్‌చరణ్‌తో షార్ట్ టైమ్‌లో అంటే వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ఓ స్టోరీ చెప్పమని ఆఫర్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

షార్ట్ టైమ్‌లో సినిమా సాధ్యమేనా?

మన శంకర వర ప్రసాద్‌ సినిమా స్క్రిప్ట్ వర్క్ కేవలం 25 రోజుల్లో ఫినిష్ చేసిన అనిల్‌కు ఇది పెద్ద కష్టం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే మాత్రం మెగా ఫ్యాన్స్‌కు వచ్చే సంక్రాంతికి ఒకే స్క్రీన్ మీద చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్‌ అల్లరిని ఎంజాయ్ చేసే అవకాశం దక్కుతుందని అంటున్నారు. మరి అనిల్‌ మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన లేటెస్ట్‌ ఆఫర్‌లో నిజమా కాదా అనేది ఆయనే క్లారిటీ ఇవ్వాలి.

అనిల్ రావిపూడి మెగా కాంపౌండ్‌తో సినిమా తీస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వార్తలపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.