|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: వెంకీ, కళ్యాణ్ రామ్ లతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. సంక్రాంతికి రికార్డులు షురూ!

Published: 26-02-2026, 10:35 AM
షాకింగ్: వెంకీ, కళ్యాణ్ రామ్ లతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. సంక్రాంతికి రికార్డులు షురూ!
  • విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్ మూవీ ప్లాన్!
  • భారీ అంచనాలతో 2027 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా!
  • మెగాస్టార్ చిరంజీవితో ‘శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో రూ.330 కోట్ల రికార్డు కలెక్షన్లు సాధించిన అనిల్.
  • తొమ్మిదవ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, ఇప్పుడు వెంకీ, కళ్యాణ్ రామ్ లతో మరో హిట్ కోసం రెడీ!

టాలీవుడ్ లో మరో సంచలనం! అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈసారి విక్టరీ వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ లతో కలిసి ఒక మల్టీస్టారర్ మూవీతో వస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

వెంకీ, కళ్యాణ్ రామ్ లతో అనిల్ రావిపూడి క్రేజీ కాంబో!

Anil Ravipudi; మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రీజనల్ సినిమాల్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో, వరుసగా తొమ్మిదవ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఈ నేపధ్యంలోనే దర్శకుడి నెక్స్ట్ సినిమాపై ఆసక్తినెలకొంది.

2027 సంక్రాంతి టార్గెట్ గా భారీ మల్టీస్టారర్ ప్లాన్!

ఏ హీరోతో చేస్తాడు? ఎలాంటి కంటెంట్ తో వస్తాడు? అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా వాళ్ళ ఎదురుచూపులకి ఎండ్ కార్డు వేస్తూ తన నెక్స్ట్ సినిమాపై అధికారిక ప్రకటన చేశాడు అనిల్ రావిపూడి. ఈ ప్రాజెక్టు కోసం మరోసారి ఇద్దరు స్టార్స్ ను కలుపుతున్నాడు అనిల్ రావిపూడి. ఆ స్టార్స్ మరెవరో కాదు తనకు ఫస్ట్ వంద కోట్ల సినిమా ఇచ్చిన విక్టరీ వెంకటేష్, తనకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్. ఈ ఇద్దరు హీరోలతో క్రేజీ మల్టీ స్టారర్ మూవీని తీసుకురాబోతున్నారు అనిల్ రావిపూడి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేశాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఈసారి కూడా సినిమాను పండగ బరిలోనే దించనున్నాడు. ఈ విషయాన్ని కూడా వీడియోలో మెన్షన్ చేశాడు. కాబట్టి, 2027 సంక్రాంతి కూడా బ్లాక్ బస్టర్ హిట్ తో స్టార్ట్ చేయడానికి సిద్ధం అయ్యాడు అనిల్ రావిపూడి. ఇక ఈ న్యూస్ తెలిసిన చాలా మంది నెటిజన్స్.. అసలు ఈ కాంబినేషన్ అసలు ఊహించలేదు. వెంకటేష్- కళ్యాణ్ రామ్ క్రేజీ కాంబో. అలాగే, సంక్రాంతి- అనిల్ రావిపూడి కూడా సూపర్ కాంబో. ఈసారి కూడా బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ల కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.