|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Star Actor: ఒకప్పటి స్టార్ హీరో.. హెయిర్‌ కట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Published: 09-07-2025, 10:10 AM
Star Actor: ఒకప్పటి స్టార్ హీరో.. హెయిర్‌ కట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌.. ఎవరో గుర్తుపట్టారా?

90లలో యువతకు హెయిర్ స్టైల్ ఐకాన్‌గా నిలిచిన ఒకప్పటి స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టాలనుకుంటున్నారా? ‘ప్రేమదేశం’ సినిమాతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న ఆ హీరో ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకుందాం.

Key Points

1

ఒకప్పుడు యువతకు హెయిర్ స్టైల్ ఐకాన్ అయిన హీరో అబ్బాస్.

2

ప్రేమదేశం సినిమాతో మంచి గుర్తింపు పొందారు.

4

సినిమా రంగంలో తిరిగి రావాలని ఆశిస్తున్నారు.

90ల యువతకు స్ఫూర్తి

చిన్నపిల్లలు , టీనేజ్ యువకులు ఎవరైనా హెయిర్ కట్ ‌ చేసుకోవాలంటే ఎక్కువగా హీరోల స్టైల్స్ ‌ నే ఫాలో అవుతుంటారు . ఆ హీరో స్టైల్ ‌ లో కటింగ్ చేయమని సెలూన్ వాళ్లను అడిగి మరీ తమ అభిమాన హీరోలా తయారవుతారు . అందుకే ఏ సెలూన్ షాప్ ‌ ల ముందైనా హీరోల హెయిర్ ‌ కట్స్ ‌ తోనే పోస్టర్స్ ‌ పెడతారు . అలా ఓ హీరోను చూసి ఎంతో యూత్ ‌ అచ్చం అలానే ఉండాలని ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ‌ ఉండేది . ఆ హీరో ఎవరో మీకు గుర్తున్నారా ? 1990 ల్లో ఓ యూత్ ‌ ఫ్యాన్స్ ‌ లో ఓ రేంజ్ ‌ లో క్రేజ్ తెచ్చుకున్న హీరో ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకవుతారు . ఒకప్పుడు హెయిర్ ‍ కట్ ‌ స్టెల్ ‌ కు బ్రాండ్ ‌ గా మారిన ఆయన ఇప్పుడు గుర్తుపట్టలేరేమోనని అనిపిస్తోంది . ఇంతకీ అతనెవరో తెలుసుకోవాలనుందా ? అయితే ఈ స్టోరీ చదివేయండి .

ఆయనే మరెవరో కాదు.. ప్రేమదేశం హీరో అబ్బాస్.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. 1990 ల్లో పుట్టిన కుర్రాళ్లను అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే అప్పట్లో ఆయన నటించిన సూపర్ హిట్ లవ్ ‌ స్టోరీ మూవీ ‘ప్రేమదేశం’ చూసి అచ్చం అబ్బాస్ లాగే హెయిర్ స్టైల్ చేయించుకున్నారు యూత్ ఆడియన్స్ ‌ . అతడిలా ఉండటానికి ఎంతోమంది ట్రై చేశారు. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు.

ప్రేమదేశం హీరో యొక్క రీ ఎంట్రీ ఆశలు

తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది . ఇది చూసిన వాళ్లు అసలు అబ్బాసేనా అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు . అంతలా మారిపోయింది మరి ఆయన కటౌట్ . తెల్లటి గడ్డం , స్టైలిష్ హెయిర్ ‌ లుక్ ‌ లో అచ్చం అప్పటిలాగే ఉన్నప్పటికీ గుర్తుపట్టడానికి కాస్తా టైమ్ ‌ తీసుకోవాల్సిందే . ఎందుకంటే అప్పటి అబ్బాస్ ‌ లవర్ ‌ బాయ్ ‌ లా ఉంటే .. ఇప్పటి అబ్బాస్ ‌ కాస్తా సీరియస్ ‌ లుక్ ‌ లో కనిపిస్తున్నాడు . ఏదేమైనా యూత్‌ హెయిర్ ‌ కట్‌కు బ్రాండ్ ‌ అంబాసిడర్ ‌ అబ్బాస్ ‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు .

రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు ..

అబ్బాస్ ప్రస్తుత జీవితం

అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో న్యూజిలాండ్ ‌ లోని కుటుంబం దగ్గరికి వెళ్లిపోయిన అబ్బాస్.. పెట్రోల్ బంక్ లో పనిచేయడం లాంటి జాబ్స్ చేశాడు. ప్రస్తుతం కార్పొరేట్ ఫీల్డ్‌లో సెటిలయ్యాడు. అయితే సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానిని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్‌ మళ్లీ చెన్నై వచ్చాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో రామానుజన్ బయోపిక్‌లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. తెలుగులో నీ ప్రేమకై , రాజా, శ్వేతనాగు , రాజహంస, ప్రియా ఓ ప్రియా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో అబ్బాస్ నటించారు.

అబ్బాస్‌ సినిమా రంగం నుండి దూరమైనా, ఆయన సినిమా ప్రేమికుల గుండెల్లో నిలిచిపోయారు. తన హెయిర్‌స్టైల్‌తో ట్రెండ్ సెట్ చేసిన ఆయన రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.