
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించారు. ‘మన శంకరవరప్రసాద్’ అనే టైటిల్‌తో ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
Key Points
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు.
సినిమా టైటిల్ 'మన శంకరవరప్రసాద్' గా ఖరారైంది.
వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.
చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్
ఈ రోజు మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు . అంతేకాకుండా చిరంజీవి సినిమాల అప్ డేట్స్ రావడంతో డబుల్ ఎనర్జీతో పుట్టినరోజును ఎంజాయ్ చేస్తున్నారు . విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి – మెగాస్టార్ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ ను కూడా రివీల్ చేశారు . టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు . వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు . ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరు గురించి మాట్లాడారు .
‘మన శంకరవరప్రసాద్’ సినిమా విశేషాలు
చిరంజీవి సినిమాల్లో రౌడీ అల్లుడు , ఘరానా మొగుడు అంటే తనకు చాలా ఇష్టమన్నారు . రీ ఎంట్రీలో చిరంజీవి స్వాగ్ ను చూపించాలకున్నట్లు తెలిపారు . చివరగా నాకు ఆ అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు . మెగాస్టార్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి ఉంటుందని అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్ చేశారు . వచ్చే ఏడాది సంక్రాంతికి మీకు డబుల్ డోస్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తానని అన్నారు .
వచ్చే సంక్రాంతి విడుదల
కాగా .. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తోంది. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్‌పై ఆధారంగా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో అన్నారు. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నారు. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.
చిరంజీవి అభిమానులకు వచ్చే సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్’ సినిమా డబుల్ ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తుందని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆశిద్దాం.


