|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ మూవీకి అనిరుధ్ రికార్డ్ రెమ్యునరేషన్! పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువా? టాలీవుడ్ షాక్!

Published: 09-03-2026, 5:05 AM
అల్లు అర్జున్ మూవీకి అనిరుధ్ రికార్డ్ రెమ్యునరేషన్! పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువా? టాలీవుడ్ షాక్!
  • అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీకి అనిరుధ్ సంగీతం.. ఇది మామూలు బ్లాస్ట్ కాదు, బాక్సాఫీస్ బద్దలే!
  • పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు.. అనిరుధ్ మ్యూజిక్ తో సినిమాకు ఊహించని హైప్!
  • ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ కంటే ఎక్కువ.. అనిరుధ్ క్రేజ్ మామూలుగా లేదుగా!
  • రూ.25 కోట్ల రెమ్యునరేషన్.. టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించిన అనిరుధ్!

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమాలో అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏమిటంటే అనిరుధ్ ఈ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

అనిరుధ్ మ్యూజిక్ తో అల్లు అర్జున్ సినిమాకు భారీ హైప్!

Anirudh: అనిరుధ్.. ప్రస్తుతం జనరేషన్ లో ఈ పేరు ఒక సంచలనం. తన మ్యాజికల్ మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆయనకీ అలవాటే. అనిరుధ్ మ్యూజిక్ చేస్తున్నాడు అంటే ఆ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోవడం ఖాయం. మరీ ముఖ్యంగా బీజీఎమ్ ల విషయంలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీల నుంచి వస్తున్న భారీ సినిమాలన్నిటికి అనిరుధ్ నే మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.

దీంతో, అనిరుధ్ కి ఫుల్ డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ చేయాలనీ కోరుకుంటున్నారు. అందుకే, ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా రెమ్యునరేషన్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు అనిరుధ్(Anirudh). అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమాకి అనిరుధ్ నే మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోకి అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పవన్ కళ్యాణ్ ను దాటిన అనిరుధ్ రెమ్యునరేషన్!

సోషల్ మీడియాలో ఈ మ్యూజిక్ పై కొన్ని మిలియన్ల రీల్స్ చేశారు అంటే అన్తఘిశయోక్తి కాదు. అంతలా, తన మ్యూజిక్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు అనిరుధ్. అయితే, తాజాగా అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ ల సినిమా కోసం అనిరుధ్ తీసుకుంటున్న రెమ్యునేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా రూ.25 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్ తో ఇది సమానం.

త్వరలో షూటింగ్.. వచ్చే ఏడాది విడుదల!

సినిమా షూటింగ్ ఆలస్యం అయినందున పవన్ కళ్యాణ్ కేవలం రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అలా ఒక స్టార్ హీరో రేంజ్ లో అనిరుధ్ రెమ్యునరేషన్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇక అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అనిరుధ్ రెమ్యునరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.