|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తో పెళ్లి ? రూమర్స్ పై అనిరుధ్ రియాక్షన్ ఇదే

Published: 15-06-2025, 4:00 AM
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తో పెళ్లి ? రూమర్స్ పై అనిరుధ్ రియాక్షన్ ఇదే

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మరియు సన్ గ్రూప్ ఛైర్మన్ కుమార్తె కావ్య మారన్ ల పెళ్లి గురించి వార్తలు ఇటీవల వైరల్ గా ప్రచారం జరిగాయి. ఈ వార్తలపై అనిరుధ్ ఇచ్చిన స్పందన ఇది.

Key Points

1

అనిరుధ్ రవిచందర్ తన పెళ్లి వార్తలను ఖండించారు.

2

కావ్య మారన్ తో అనిరుధ్ ప్రేమలో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.

4

అనిరుధ్ X ఖాతాలో ఈ వార్తలను తప్పు అని పేర్కొన్నారు.

అనిరుధ్ పెళ్లి వార్తలు వైరల్

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన పెళ్లిపై వెలువడుతున్న ఊహాగానాలను ఖండించారు. సన్ గ్రూప్ ఛైర్మన్ కలానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి జరగనుంది అనే ప్రచారం ఇటీవల ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనిరుధ్ స్వయంగా స్పష్టం చేశారు.

ఈ గాసిప్స్‌కు మూలం రెడిట్‌లో వచ్చిన ఓ పోస్ట్. ఇందులో అనిరుధ్, కావ్య మారన్ గత ఏడాదిగా ప్రేమలో ఉన్నారని, కుటుంబాల మధ్య ఇప్పటికే వివాహ చర్చలు జరిగినట్లు, రజనీకాంత్ కూడా ఈ వ్యవహారంలో భాగమయ్యారని పేర్కొన్నారు. అలాగే అనిరుధ్, కావ్య కలిసి లాస్ వెగాస్ సహా పలు ప్రాంతాల్లో వెకేషన్ లో కనిపించారన్న వదంతులు కూడా చక్కర్లు కొట్టాయి. రూమర్స్ ఎక్కువవుతున్న తరుణంలో అనిరుధ్ స్పందించారు.

రెడ్డిట్ పోస్ట్ లో ప్రచారం

తన X  ఖాతాలో.. ఏంటి పెళ్లా ? చిల్ అవుట్ గయ్స్, ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

అనిరుధ్ ఇప్పటికే పలుమార్లు తాను ఒంటరిగా ఉన్నానని, త్వరలో పెళ్లి చేసుకోవాలని ఎలాంటి ప్రణాళికలు లేవని స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు.

అనిరుధ్ స్పందన

ఇక కావ్య మారన్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, సన్ గ్రూప్ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. కావ్య మారన్ ఐపీఎల్ ప్రాంఛైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ద్వారా తెలుగువారికి బాగా చేరువయ్యారు.

చివరకు, అనిరుధ్ రవిచందర్ తన X ఖాతా ద్వారా ఈ పెళ్లి వార్తలను తప్పు అని స్పష్టం చేశారు. ఈ వార్తలకు అతను స్వయంగా ముగింపు పలికాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.