|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘సన్‌రైజర్స్’ ఓనర్‌తో పెళ్లి.. స్పందించిన అనిరుధ్‌!

Published: 15-06-2025, 2:10 AM
‘సన్‌రైజర్స్’ ఓనర్‌తో పెళ్లి.. స్పందించిన అనిరుధ్‌!

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తో ఆయనకు పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చాయి.

Key Points

1

అనిరుధ్ రవిచందర్ పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తున్నాయి.

2

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తో పెళ్లి రూమర్స్ వచ్చాయి.

4

అనిరుధ్ ప్రస్తుతం రజనీకాంత్, విజయ్ దేవరకొండ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.

అనిరుధ్ పెళ్లి రూమర్స్

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందన్‌(Anirudh Ravichander ) పెళ్లిపై ప్రతిసారి ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. గతంలో నటి ఆండ్రియాతో అనిరుధ్‌ పెళ్లి అనే ప్రచారం జరిగింది. అందులో కూడా వాస్తవం లేదని తేలింది. వారిద్దరు డేటింగ్‌ చేసినా..కొన్నాళ్లకు బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత కీర్తి సురేశ్‌తో పెళ్లి పక్కా అని కోలీవుడ్‌ అంతా కోడై కూసింది. కీర్తి పెళ్లయిన తర్వాత ఆ రూమర్స్‌ తగ్గిపోయాయి.

ఇక ఇప్పుడు ఈ టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పెళ్లిపై మరో రూమర్‌ బయటకు వచ్చింది. ఐపీఎల్‌లో కీలక జట్టు ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ అధినేత కావ్యా మారన్‌( kavya Maran)ని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టింది. 2014 నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో మాత్రం పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి.

కావ్యా మారన్ తో పెళ్లి వార్తలు

దీనిపై అనిరుధ్‌ స్పందించాడు. ‘‘నాకు పెళ్లా..? చిల్‌ అవ్వండి.. ఇలాంటి రూమర్స్‌ని స్ప్రెడ్‌ చేయకండి’అని అనిరుధ్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో కావ్యా మారన్‌ తో పెళ్లి అనేది కూడా పుకారేనని తేలిపోయింది.

అనిరుధ్ స్పందన

అనిరుధ్  కెరీర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌ కూలీ, విజయ్‌ దేవరకొండ కింగ్డమ్‌ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.  దీంతో పాటు నాని, శ్రీకాంత్‌ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రం %ప్యారడైజ్‌’కి కూడా అనిరుధే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.

కావ్యా మారన్ తో అనిరుధ్ పెళ్లి వార్తలు నిజం కాదని అనిరుధ్ స్వయంగా స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆయన తన సంగీత ప్రస్థానంపై దృష్టి సారించాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.