
📌 Key Points
- అనిరుధ్ కాన్సర్ట్‌కు గచ్చిబౌలి స్టేడియం వేదిక
- టికెట్ ఉన్నవారికి పార్కింగ్ ప్రదేశాలపై స్పష్టత
- సాయంత్రం 4:30 నుండి గేట్లు తెరుస్తారు
- రాత్రి 11 గంటల వరకు షటిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది
రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు పార్కింగ్, ఎంట్రీ మరియు ఇతర ముఖ్యమైన వివరాలను తెలియజేశారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ కాన్సర్ట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
కాన్సర్ట్ ఎక్కడ, ఎప్పుడు?
Anirudh XV Tour: రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ (Anirudh XV Tour)లో భాగంగా హైదరాబాద్‌లో శనివారం జరగబోయే లైవ్ కాన్సర్ట్‌కి ముందుగానే ప్లాన్ చేసుకొని రావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ మేరకు వారు ఈ లైవ్ కాన్సర్ట్‌కు వెళ్లే వారికి పార్కింగ్, ఎంట్రీ, ఇంకా ఇతర వివరాలను అధికారికంగా తెలియజేశారు. గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో మార్చి 21 శనివారం జరగబోయే రాక్‌స్టార్ అనిరుధ్ XV – 15 ఇయర్స్ విత్ యూ సంగీత కచేరీకి నగరం సిద్ధమైంది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన సంగీత ప్రయాణంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌ను బ్రాండ్ అవతార్ నిర్వహిస్తుండగా, ట్రైబ్‌వైబ్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ సహకారంతో, Ocean Vibes ప్రెజెంట్ చేస్తోంది. ఈ కాన్సర్ట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తూ, నిర్వాహకులు ప్రత్యేక పార్కింగ్, షటిల్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఆ వివరాలివే..
గేట్లు తెరవబడే సమయం: సాయంత్రం 4:30 గంటలకు మాత్రమే స్టేజ్ ప్రారంభం: సాయంత్రం 6:00 గంటలకు మాత్రమే
పార్కింగ్ వివరాలు ఎలా ఉన్నాయి?
బోల్డర్ హిల్స్ పార్కింగ్: సిల్వర్ అండ్ గోల్డ్ టికెట్ హోల్డర్లకు మాత్రమే (కార్లు అండ్ బైక్‌లకు పార్కింగ్ అందుబాటులో ఉంటుంది). బైక్ పార్కింగ్ కేవలం ఇక్కడే అందుబాటులో ఉంటుంది. షటిల్ సర్వీస్ (పరిమిత బస్సులు మాత్రమే). ఇంకా గేట్ 1, గేట్ 4 ద్వారా ప్రవేశానికి సంబంధించిన మాప్‌లను విడుదల చేశారు. ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ పద్ధతిలో పార్కింగ్ ఉంటుందని తెలిపారు. సంధ్యా కన్వెన్షన్ పార్కింగ్: ఫ్యాన్ పిట్ టికెట్ హోల్డర్లకు మాత్రమే. ఇక్కడ కేవలం కార్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. షటిల్ సర్వీస్ పరిమిత బస్సులు మాత్రమే. ఇక్కడ కూడా ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ విధానంలోనే సర్వీస్ ఉంటుందని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం పార్కింగ్: రాక్‌స్టార్ ఫ్యాన్ పిట్ టికెట్ హోల్డర్లకు మాత్రమే. ఇక్కడ కూడా ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ విధానమే ఉంటుందని తెలిపారు.
షటిల్ సర్వీస్ వివరాలు
టికెట్‌కు అనుగుణంగా కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు పార్క్ చేయాలి. షటిల్ సర్వీస్ రాత్రి 11 గంటలకు ముగుస్తుంది కాబట్టి, ముందుగానే రావడం మంచిదని తెలియజేశారు. క్యాబ్ డ్రాప్ అండ్ పికప్ పాయింట్: స్టేడియం గేట్ సమీపంలో ట్యాక్సీ డ్రాప్ అండ్ పికప్ పాయింట్ ఏర్పాటు చేయబడింది. ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు ట్యాక్సీలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా కార్‌పూలింగ్ ఉపయోగించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. కావున అందరూ కూడా సమయ కంటే ముందే వచ్చి, పార్కింగ్ అండ్ రవాణా ప్లాన్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా ఈ సంగీత వేడుకను ఆస్వాదించాలని, ఈ రాత్రిని మరచిపోలేని అనుభూతిగా మార్చుకోవాలని నిర్వాహకులు ఈ సందర్భంగా కోరారు.
అనిరుధ్ సంగీత కచేరీకి హాజరయ్యే అభిమానుల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సూచనలు పాటించి సంతోషంగా కాన్సర్ట్‌ను ఆస్వాదించండి. రాత్రి 11 గంటల వరకు షటిల్ సర్వీస్ ఉంటుంది.


