
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి తీవ్ర అస్వస్థత అని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది.
Key Points
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురైనట్లు వార్తలు
పవన్ కల్యాణ్ అమరావతి నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం
మెగా ఫ్యామిలీ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
అంజనా దేవి ఆరోగ్య పరిస్థితి
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి.. తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ మీటింగ్‌లో ఉన్న పవన్ కల్యాణ్.. హుటాహుటిన అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్‌కి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ విషయం వినిపిస్తుంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అస్వస్థత గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
పవన్ కల్యాణ్ హుటాహుటిన బయలుదేరి
ఈ ఏడాది జనవరిలో అంజనా దేవి.. 75వ పుట్టినరోజు సెలబ్రేట్ పూర్తి చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నిరోజులకే అంటే ఫిబ్రవరిలో.. ఈమె అనారోగ్యానికి గురయ్యారనే రూమర్స్ వచ్చాయి. కానీ వెంటనే కోలుకున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని మెగా ఫ్యామిలీ నుంచి స్పష్టత వచ్చింది. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురయ్యారనే తెలిసి మెగా అభిమానులు కంగారు పడుతున్నారు.
మెగా ఫ్యామిలీ స్పందన
అంజనా దేవికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల విషయానికొస్తే చిరంజీవి హీరోగా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మనవడు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్. మిగిలిన ఇద్దరు కొడుకులు నాగబాబు, పవన్ కల్యాణ్. కూతుళ్ల పిల్లలు కూడా ప్రస్తుతం నటులుగా రాణిస్తున్నారు. కుటుంబం అంతా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.
ప్రస్తుతం అంజనా దేవి ఆరోగ్యం గురించి స్పష్టత లేదు. మెగా ఫ్యామిలీ నుండి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.


