|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలీవుడ్‌లో కొత్త సంచలనం: విలన్‌గా రూ. 2000 కోట్లు! 30 ఏళ్ల తర్వాత అక్షయ్ ఖన్నా రికార్డు!

Published: 05-01-2026, 8:00 AM
బాలీవుడ్‌లో కొత్త సంచలనం: విలన్‌గా రూ. 2000 కోట్లు! 30 ఏళ్ల తర్వాత అక్షయ్ ఖన్నా రికార్డు!
  • అక్షయ్ ఖన్నా 2025లో రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రెండో భారతీయ నటుడు.
  • ఈ రికార్డును కేవలం ‘ఛావా’ మరియు ‘ధురంధర్’ సినిమాల్లో విలన్ పాత్రలతోనే అందుకున్నారు.
  • షారుక్ ఖాన్ తర్వాత ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన ఏకైక నటుడు అక్షయ్ ఖన్నా.
  • ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా ఒకే ఏడాదిలో ఈ మార్క్ అందుకోలేకపోయారు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా 30 ఏళ్ల కెరీర్‌లో 2025 ఏడాదిలో సంచలనం సృష్టించారు. ఒకే ఏడాదిలో రెండు విలన్ పాత్రలతో రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, షారుక్ ఖాన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ నటుడిగా నిలిచారు. ఇది అక్షయ్ కెరీర్‌లోనే అతి పెద్ద విజయం.

అక్షయ్ ఖన్నాకు కలిసొచ్చిన 2025 ఏడాది

ఒకే ఏడాది రూ.2 వేల కోట్ల వసూలు చేసిన హీరోలు ఎంత మంది తెలుసు? కానీ ఓ విలన్ పాత్ర పోషించిన నటుడు ఇప్పుడీ జాబితాలో చేరాడు. అతని పేరు అక్షయ్ ఖన్నా. ఈ మధ్యే ధురంధర్ సినిమాలో నటనకుగాను అతనికి మంచి ప్రశంసలు దక్కాయి.

మూడు దశాబ్దాల కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా 2025 ఏడాది బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నాకు కలిసొచ్చింది. ఒకే ఏడాదిలో ఏకంగా రూ. 2000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన రెండో భారతీయ నటుడిగా అతడు చరిత్ర సృష్టించాడు. షారుక్ ఖాన్ తర్వాత ఈ ఘనత సాధించింది అక్షయ్ మాత్రమే కావడం విశేషం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ అతడు చేసింది విలన్ పాత్రలే.

విలనిజం వర్కౌట్ అయ్యింది..

విలన్ గానే రూ.2000 కోట్ల విజయం

మొదట గతేడాది జనవరిలో విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన ఛావా సినిమాలో అక్షయ్ ఖన్నా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 809 కోట్లు రాబట్టింది.

ఇక డిసెంబర్‌లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌ ధురంధర్ మూవీలో గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ డకైత్ పాత్రలో అక్షయ్ జీవించేశాడు. రణ్‌వీర్ సింగ్ హీరో అయినప్పటికీ, అక్షయ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1200 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ రెండు సినిమాలు కలిపి 2025లో అక్షయ్ ఖన్నా ఖాతాలో రూ. 2000 కోట్లకుపైగా గ్రాస్ జమ కావడం విశేషం.

స్టార్ హీరోల రికార్డులను బద్దలుకొట్టిన అక్షయ్

ప్రభాస్ (బాహుబలి 2), అల్లు అర్జున్ (పుష్ప 2) వంటి స్టార్లు ఒక్కో సినిమాతో రూ. 1700 కోట్ల వరకు వచ్చారు కానీ.. ఒకే ఏడాదిలో 2000 కోట్ల మార్క్ అందుకోలేకపోయారు. ఆమిర్ ఖాన్ ‘దంగల్’ కూడా రెండు వేర్వేరు సంవత్సరాల్లో (చైనా రిలీజ్ కలుపుకుని) ఈ మార్క్ దాటింది.మొత్తానికి 2025 సంవత్సరం అక్షయ్ ఖన్నాకు మరచిపోలేని ఏడాదిగా మిగిలిపోయింది.

ఈ సినిమాలో భూమి శెట్టి ‘మహా’ అనే ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అక్షయ్ ఖన్నా రోల్ ఏంటనేది సస్పెన్స్ గా ఉంచారు. కానీ అతని పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట.

మొత్తానికి 2025 సంవత్సరం అక్షయ్ ఖన్నా కెరీర్‌లోనే మరచిపోలేని ఏడాదిగా నిలిచిపోయింది. విలన్ పాత్రలతోనే రూ. 2000 కోట్లు సాధించిన ఆయన విజయం బాలీవుడ్‌లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఇది ఆయన కెరీర్‌కు పెద్ద మైలురాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.