|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమిళనాడులో అనూహ్య మలుపు: అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు సంచలన లేఖ!

Published: 08-05-2026, 8:15 PM
తమిళనాడులో అనూహ్య మలుపు: అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు సంచలన లేఖ!
  • తమిళనాడులో విజయ్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 118కు రెండు సీట్ల కొరత.
  • IUML మద్దతు ఉపసంహరణ, VCK నుంచి అధికారిక లేఖ లేకపోవడం.
  • టీటీవీ దినకరన్ గవర్నర్‌కు లేఖ ద్వారా అన్నాడీఎంకేకు అవకాశం కోరారు.
  • పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి.

తమిళనాడు రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ పార్టీకి సంఖ్యాబలంపై సందిగ్ధత నెలకొనగా, అన్నాడీఎంకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని టీటీవీ దినకరన్ గవర్నర్‌కు సంచలన లేఖ రాశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

విజయ్ పార్టీకి సంఖ్యాబలం సందిగ్ధత

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా TVK నిలిచినప్పటికీ విజయ్ కి నిద్ర లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆయన చాలా కష్టపడుతున్నారు. ముందుగా మద్దతు ప్రకటించిన IUML తాజాగా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మద్దతిస్తామని ప్రకటించిన VCK నుంచి గవర్నర్ కు అధికారికంగా లేఖ‌ కూడా అందలేదని స‌మాచారం.

దీంతో విజయ్ పార్టీకి సంఖ్యా బలం 116కు పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ 118 అందుకోవాలంటే మరో రెండు సీట్లు అవసరం. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఇదంతా పక్కకు పెడితే, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. శశికళ సోదరి కుమారుడు, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ( AMMK ) పార్టీ చీఫ్ టీటీవీ దినకరణ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అన్నాడీఎంకే అధినేత పళ‌ని స్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ రాజేంద్రకు ఆయన తాజాగా లేఖ రాశారు. బలం నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా మొన్నటి ఎన్నికల్లో AMMK పార్టీ ఒక సీటు కూడా గెలిచింది.

సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన టీటీవీ దినకరన్

అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ

మొత్తంమీద, తమిళనాడు రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. విజయ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కోసం ప్రయత్నిస్తుండగా, అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలన్న దినకరన్ లేఖ కొత్త సమీకరణాలకు తెరలేపింది. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.