|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ బర్త్ డే: అన్నా కొణిదెల షాకింగ్ ట్రీట్! ఇంతకు ముందెన్నడూ చూడని ఫోటో వైరల్!

Published: 27-03-2026, 6:35 AM
రామ్ చరణ్ బర్త్ డే: అన్నా కొణిదెల షాకింగ్ ట్రీట్! ఇంతకు ముందెన్నడూ చూడని ఫోటో వైరల్!
  • రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ భార్య అన్నా కొణిదెల అన్ సీన్ ఫోటో షేర్ చేశారు.
  • అన్నా కొణిదెల రామ్ చరణ్, మార్క్ శంకర్ కలిసి ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
  • మార్క్ శంకర్ తరపున రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అన్నా కొణిదెల.
  • రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కుస్తీ పోటీల గ్లింప్ వీడియో వైరల్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల ప్రత్యేకంగా స్పందించారు. రామ్ చరణ్, తన కుమారుడు మార్క్ శంకర్ కలిసి ఉన్న అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

రామ్ చరణ్ కు అన్నా కొణిదెల విషెస్

Anna Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన 41వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అభిమానులు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ (Ramcharan)కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే ఇన్ని రోజులపాటు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా (Anna Lezinova) ఇటీవల ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇలా అన్నా కొణిదెల ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టగానే మొదటి పోస్ట్ పవన్ కళ్యాణ్ తో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. అనంతరం చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలు ఈమె షేర్ చేశారు. అయితే నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ తన కొడుకు మార్క్ శంకర్(Mark Shankar) తో కలిసి ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మార్క్ శంకర్ తరఫున రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే టూ యు చరణ్ అన్న అంటూ మార్క్ తరపున ఈమె శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడు ఎంతో ఆరోగ్యంగా, బలంగా, మంచి విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ చేశారు.

వైరల్ అవుతున్న అన్నా కొణిదెల పోస్ట్

ప్రస్తుతం అన్నా కొణిదెల షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోలు ఎక్కడ కనపడలేదు ఇలా ఎవరు చూడనటువంటి ఫోటోని అన్నా కొణిదెల షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ అన్నా దంపతులకు ఒక కుమార్తె కుమారుడనే విషయం మనకు తెలిసిందే. ఇలా మెగా వారసులిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ ఫోటోని అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు.

రామ్ చరణ్ పుట్టినరోజు ప్రత్యేకతలు

ఇక రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు పెద్ద సినిమా నుంచి గ్లింప్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కుస్తీ పోటీలకు సంబంధించిన వీడియోను విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున సినిమా పట్ల అంచనాలను కూడా పెంచేస్తోంది. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదీ విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ సినిమా వాయిదా అంటూ చిత్ర బృందం మాత్రం ఎక్కడ వెల్లడించలేదు. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి గ్లింప్, పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ లో ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన విడుదల కాబోతున్నట్లు తెలియజేయడంతో ఈ సినిమా ఎట్టి పరిస్థితులలోను వాయిదా పడే అవకాశాలు లేవని స్పష్టం అవుతుంది.

అన్నా కొణిదెల షేర్ చేసిన ఈ అరుదైన ఫోటో మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.