
📌 Key Points
- అనుపమ, ధ్రువ్ విక్రమ్ ముంబై అవార్డుల వేడుకలో కలిసి కనిపించారు.
- ధ్రువ్ సెల్ఫీని అనుపమ హార్ట్ ఎమోజీతో రీ-షేర్ చేయడంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి.
- అనుపమ రాత్రి 2 గంటలకు ఫోన్ చేయాలంటే ధ్రువ్‌కే చేస్తానని చెప్పింది.
- బైసన్ కాలమాడన్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు.
అనుపమ పరమేశ్వరన్, యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వీరి మధ్య ఏదో నడుస్తుందని అందరూ భావిస్తున్నారు.
ధ్రువ్, అనుపమల మధ్య ప్రేమ చిగురించిందా?
Anupama Parameswaran: కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రేమలో పడిందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలు. గత కొంతకాలంగా ‘చియాన్’ విక్రమ్ వారసుడు, యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్‌తో ఈ అమ్మడు పీకల్లోతు ప్రేమలో ఉందని సోషల్ మీడియాలో ఒకటే రచ్చ జరుగుతోంది. తాజాగా వీరు షేర్ చేసిన సెల్ఫీలు, హార్ట్ ఎమోజీలు చూస్తుంటే ఈ జంట తమ రిలేషన్‌షిప్‌ను దాదాపు కన్ఫర్మ్ చేసినట్టే కనిపిస్తోంది. మరి అసలు విషయం ఏమిటన్నది చూద్దాం..
ముంబైలో జరిగిన ‘టీహెచ్ఆర్ ఇండియాస్ ది ఆనర్స్’ అవార్డ్స్ వేడుక ఈ జంట ప్రేమ వార్తలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ఫంక్షన్‌లో ధ్రువ్ విక్రమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమతో దిగిన ఒక క్యూట్ సెల్ఫీని పోస్ట్ చేయగా.. దాన్ని అనుపమ ‘హార్ట్ ఎమోజీ’తో రీ-షేర్ చేయడం నెట్టింట మంట పుట్టించింది. ఇక అంతకుముందు కూడా రాత్రి 2 గంటలకు ఫోన్ చేయాల్సి వస్తే ఇండస్ట్రీలో ఎవరికి చేస్తారని అడిగితే, తడుముకోకుండా “ధ్రువ్‌కి చేస్తా” అని అనుపమ చెప్పడం వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చెప్పకనే చెబుతోంది. అభిమానులు మాత్రం ఇక అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఒకటే తక్కువ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘బైసన్ కాలమాడన్’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళకముందే వీరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందని టాక్. ఇద్దరూ తమ పర్సనల్ స్పాటిఫై మ్యూజిక్ ప్లేలిస్ట్‌లను షేర్ చేసుకోవడం, ఒకానొక సందర్భంలో అన్‌వెరిఫైడ్ సెల్ఫీ బయటకు రావడం వంటివి ఈ పుకార్లకు బాగా ఆజ్యం పోశాయి. తాజాగా చెన్నైలో జరిగిన ‘జేఎఫ్‌డబ్ల్యూ అవార్డ్స్’లో కూడా ఈ జంట ఒకరి పక్కన ఒకరు కూర్చుని సందడి చేయడంతో.. కేవలం స్నేహం మాత్రమే కాదని, అంతకు మించి ఏదో ఉందని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. అనుపమ 2025లో ఫుల్ స్వింగ్‌లో ఉంది. తెలుగులో పరదా, కిష్కింధపురి వంటి సినిమాలతో పాటు తమిళంలో డ్రాగన్, లాక్‌డౌన్ వంటి చిత్రాలతో బిజీగా గడిపింది. అటు ధ్రువ్ విక్రమ్ కూడా ‘బైసన్’ సినిమాతో తనలోని నటుడిని కొత్తగా పరిచయం చేసుకున్నాడు. ఒక పక్క కెరీర్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతూనే, మరోపక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఇద్దరూ ఒకే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ కోడలిగా అనుపమ వెళ్ళబోతోందా అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న అనుపమ?
అనుపమ, ధ్రువ్‌ల జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ పుకార్లపై వీరిద్దరూ అధికారికంగా స్పందించనప్పటికీ, వీరి సోషల్ మీడియా పోస్టులు మాత్రం వేల అర్థాలను చెబుతున్నాయి. మరి ఈ ‘బైసన్’ జంట పెళ్లి పీటల వరకు వెళ్తుందో లేదో వేచి చూడాలి.
మొత్తానికి అనుపమ, ధ్రువ్ ల రిలేషన్ షిప్ గురించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం వీరి పెళ్లి గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


