|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎప్‌స్టీన్ ఫైల్స్‌ కలకలం: అనురాగ్ కశ్యప్‌పై ఆరోపణలు! నిజమెంత?

Published: 06-02-2026, 2:35 AM
ఎప్‌స్టీన్ ఫైల్స్‌ కలకలం: అనురాగ్ కశ్యప్‌పై ఆరోపణలు! నిజమెంత?
  • ఎప్‌స్టీన్ ప్రైవేట్ పార్టీలకు సినీ ప్రముఖులు హాజరయ్యారనే వార్తలు సంచలనం.
  • ఈ పార్టీలలో చిన్న వయసు అమ్మాయిలతో శృంగారం చేసేవారని ఆరోపణలు.
  • బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా పార్టీకి వెళ్లారనే వార్తలపై స్పందన.
  • బీజింగ్‌కు ఎప్పుడూ వెళ్లలేదని అనురాగ్ కశ్యప్ ఖండించారు.

ప్రస్తుతం ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఫైల్స్‌లో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పేరు కూడా ఉండటంతో ఆయన ఈ వార్తలపై స్పందించారు. ఆయన బీజింగ్ వెళ్లినట్లు వస్తున్న వార్తలను ఖండించారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అనురాగ్ కశ్యప్ పేరు?

Epstein Files: ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒకే ఒక్క మాట ఎప్‌స్టీన్ ఫైల్స్.. అమెరికాకు సంబందించిన ఎప్‌స్టీన్ అనే వ్యాపార వేత్త ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతమంది వ్యాపారవేత్తలతో పాటుగా సినీ సెలబ్రిటీలు కూడా వెళ్లినట్లు ఓ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.. ఆ పార్టీలలో చిన్న వయసు అమ్మాయిలతో శృంగారం చేసేవారని ఆరోపణలు వినిపిస్తుంది. ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ పార్టీలకు సంబంధించిన ఎన్నో ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ పార్టీల కు బాలీవుడ్ బడా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా వెళ్లినట్లు ఓ వార్త మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. తాజాగా ఆ వార్తల పై బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్పందించారు.. ఆయన ఏమన్నారో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఎప్‌స్టీన్ పార్టీలో అమెరికన్ల తో పాటుగా వివిధ దేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు భాగమైనట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా నిర్మాత అనురాగ్ కశ్యప్ కూడా ఈ పార్టీ కోసం గతంలో ఒకసారి బీజింగ్ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తలు ప్రస్తుతం బాలీవుడ్ మీడియాల్లో హాట్ టాపిక్ గా మారాయి.. తాజాగా ఈ వార్తల పై డైరెక్టర్ స్పందించారు.. ఆయన ఏమన్నారంటే..

వార్తలపై అనురాగ్ కశ్యప్ వివరణ

బీజింగ్‌కు వెళ్లలేదని ఖండన

బాలీవుడ్ డైరెక్టర్, బడా నిర్మాత అనురాగ్ కశ్యప్ బీజింగ్ కు వెళ్లినట్లు ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ నీయంశంగా మారింది.. తాజాగా ఈయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. నాకు ఎప్పుడు ఇలాంటివి 15 కు పైగా ఆహ్వానాలు అందుతాయి. నేను అన్నింటికీ స్పందించను. నేను అరుదుగా మాత్రమే రెస్పాండ్ అవుతుంటా. నా జీవితంలో ఇప్పటివరకు బీజింగ్‌కే వెళ్ళలేదు అని ఆయన వార్తలకు రియాక్ట్ అయ్యారు.. నేను అందిస్తున్న సినిమాల కంటే ఇలాంటి వార్తలే నన్ను హైలెట్ అయ్యేలా చేస్తున్నాయని ఆయన అన్నారు. బాలీవుడ్‌కు చెందిన మరి కొంతమంది దర్శక నిర్మాతలు, నటీనటులు ఈ పార్టీల్లో పాల్గొన్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే మాజీ అధ్యక్షకుడు బిల్ క్లింటన్, ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, లెజెండరీ బిజినెస్‌ మ్యాన్ బిల్ గేట్స్ వంటి ఎంతోమంది ప్రముఖుల పేర్లు వినిపించాయి. వీరంతా తప్పు చేశారని నిర్దారణ రాలేదు.. నిజానికి  వీరిలో కొంతమంది మాత్రమే పార్టీలో ఉన్నట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. వీలైనంత త్వరలోనే ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని టాక్..

అనురాగ్ కశ్యప్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను ఎప్పుడూ బీజింగ్‌కు వెళ్లలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.