
📌 Key Points
- నటి విష్ణుప్రియపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగిపోయింది.
- మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ‘ప్లే లైక్ ఇంకాగ్నిటో’ యూట్యూబ్ ఛానెల్‌పై కేసు నమోదు.
- వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు.
- ఇలాంటి చర్యలకు పాల్పడే అందరికీ విష్ణుప్రియ గట్టి హెచ్చరిక.
నటి విష్ణుప్రియ సోషల్ మీడియా ట్రోలర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. ‘ప్లే లైక్ ఇంకాగ్నిటో’ అనే యూట్యూబ్ ఛానెల్‌పై ఫిర్యాదు చేసి, కఠిన చర్యలకు దిగింది.
విష్ణుప్రియకు ట్రోలింగ్ వేధింపులు
Vishnu Priya : విష్ణుప్రియ భీమనేని…. ‘పోవే పోరా’,’జబర్దస్త్’ వంటి ఎంటర్ టైనింగ్ కామెడీ షోలతో పాటు చెక్ మేట్’, ‘దయా’ వెబ్ సిరీస్ లతో ఆడియన్స్ కి బాగా దగ్గరైన సంగతి తెల్సిందే.ఇక అసలు విషయానికి వస్తే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విష్ణు ప్రియపై ట్రోలింగ్ పెరిగిపోయింది. దీంతో ట్రోలింగ్ రూపంలో తనపై నెగిటివిటీని విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నవారిపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది విష్ణుప్రియ.నటీనటుల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, క్యారెక్టర్ అస్సాసినేషన్ చేసేలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలకు దిగింది.
ప్లే లైక్ ఇంకాగ్నిటో’ అనే యూట్యూబ్ ఛానల్‌పై కేస్
తమ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ నిరంతరం తప్పుడు ప్రచారం సాగిస్తున్న ‘ప్లే లైక్ ఇంకాగ్నిటో’ అనే యూట్యూబ్ ఛానల్‌పై ఆమె హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో అఫీషియల్ గా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తీవ్రస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా విష్ణుప్రియ మాట్లాడుతూ, తాను మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చానని, పోలీసులు తక్షణమే స్పందించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని చెప్పుకొచ్చింది.
పోలీసులకు ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ నమోదు
బాధ్యులపై కఠినమైన యాక్షన్ తీసుకోబోతున్నందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.అయితే విష్ణు ప్రియ కంపైంట్ చేసిన ఈ వివాదాస్పద యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది ఒక అమ్మాయే కావడం గమనార్హం. ఒక మహిళ అయ్యుండి, తోటి సెలబ్రిటీ మహిళల క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంపై విష్ణుప్రియ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.అందుకే ఆమెపై ఖచ్చితంగా లీగల్ చర్యలు తీసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
విష్ణుప్రియ ఒక స్ట్రాంగ్ వార్నింగ్
కేవలం ఈ ఒక్క ఛానల్ మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో ఇలాంటి నీచమైన పనులు చేస్తున్న వారందరికీ విష్ణుప్రియ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి. నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఊరుకునేది లేదని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సదరు ఛానల్స్ డిలీట్ అయ్యేలా స్ట్రైక్స్ వేయిస్తామని హెచ్చరించింది. ఈ యాక్షన్ ఎప్పుడో తీసుకోవాల్సిందని, కానీ చాలా రోజులు ఓపిక పట్టి చూశానని మనసులోని బాధని బయటపెట్టింది. ఎన్నో నిందలు భరించి, ఎంతో రాంగ్ పబ్లిసిటీని ఎదుర్కొన్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెల్చి చెప్పింది. తప్పుడు సమాచారాన్ని నిజమైన ఇన్ఫర్మేషన్ లాగా ఆడియన్స్‌కి ప్రొజెక్ట్ చేస్తూ వ్యూస్ కోసం కొందరు దిగజారుతున్నారని మండిపడింది.
చూస్తూ నోరు మూసుకొని ఉండలేను
ట్రోలర్స్‌కు విష్ణుప్రియ స్ట్రాంగ్ వార్నింగ్
తాము ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌కి వచ్చింది జనాలను ఆనందపరచడానికేనని, రోజంతా పడే బాధల నుంచి ప్రజలు ఒక ఐదు పది నిమిషాలు తమ కంటెంట్ చూసి రిలాక్స్ అవ్వాలనేదే తమ తాపత్రయమని ఎమోషనల్ అయింది. ఒకవేళ తమ ప్రవర్తనలో ఏవైనా నిజమైన తప్పులుంటే నిందించవచ్చని, తలదించుకుని ఆ మాటలు పడతామని, కానీ తప్పు చేయనప్పుడు కూడా డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది అనే స్థాయికి దిగజారి మాట్లాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద పెద్ద ఛానల్స్‌లోనే కూర్చుని కొందరు పెద్దవాళ్లు ఇలాంటి నీచమైన పదజాలం వాడుతున్నారని ,ఇక పై ఇలాంటి వాటిని చూస్తూ నోరు మూసుకొని ఉండలేనని, తన కోసమే కాకుండా, పరిశ్రమలోని ఇతర ఆడపిల్లల గౌరవం కోసం ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెల్చి చెప్పింది విష్ణు ప్రియ.
ప్రస్తుతానికి ఒక్కరితోనే ఈ లీగల్ ఫైట్ స్టార్ట్ చేశామని, ఇక ముందు ఎవరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని విష్ణుప్రియ గట్టిగా హెచ్చరించింది. ఇక విష్ణు ప్రియ తీసుకున్న ఈ నిర్ణయానికి పెద్ద ఎత్తున సపోర్ట్ లభించడం విశేషం. చూడాలి మరి ఇకనైనా అడ్డగోలుగా ట్రోలింగ్ చేసేవారు అడ్డుకట్ట వేస్తారో లేదో !
విష్ణుప్రియ తీసుకున్న ఈ చర్య సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారికి ఒక హెచ్చరికగా నిలుస్తుంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కించపరచడం సరికాదని ఆమె స్పష్టం చేసింది.


