
📌 Key Points
- ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తేరి సినిమా నుండి ప్రేరణ పొందింది, కానీ మార్పులు చేశారు.
- పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగినట్లుగా కథలో మార్పులు చేశారు.
- ఈ సినిమాలో మహిళల గౌరవం గురించి బలమైన సందేశం ఉంటుంది.
- ఇంటర్వెల్ సీన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా తమిళంలో వచ్చిన తేరి సినిమా ఆధారంగా రూపొందుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగినట్లుగా ఇందులో మార్పులు చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ కథా నేపథ్యం
Ustaad Bhagath Singh Story: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ ట్రెండ్ అవుతూ ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల.. ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమా కథకు తమిళంలో వచ్చిన తేరి..సినిమాను ప్రేరణగా తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత కథను పూర్తిగా మార్చి పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా రూపొందించారని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో ముఖ్యంగా మహిళల గౌరవం, మహిళల సార్ధకత గురించి బలమైన సందేశం ఉండబోతుందని తెలుస్తోంది. కథలో ఒక అమ్మాయి రేప్ కి.. గురైన తర్వాత హీరో ఎలా ఆమెకు న్యాయం చేస్తాడు అన్న అంశం ప్రధానంగా ఉండబోతుందట. ముఖ్యంగా ఇంటర్వెల్ లో ఆ అమ్మాయి ఎదుర్కొనే సమస్యలను చూపిస్తారని..ఆ తర్వాత హీరో రంగంలోకి దిగే విధానం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ పాత్రలో ప్రత్యేకతలు
ఇంటర్వెల్ సీన్ ఈ సినిమాలో హైలైట్ అవుతుందని దర్శకుడు హరీష్ శంకర్ కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ ఇంటర్వెల్ సీన్ ఇదేనని ఆయన చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. పవన్ కళ్యాణ్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చూపించాలనే తపన తనకు ఉందని కూడా హరీష్ శంకర్ వెల్లడించాడు. అంతేకాకుండా రెండో భాగంలో మహిళల గురించి పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా ఉంటాయి అని వినికిడి.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ నటుడు పార్థిబన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
సంగీతం విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరింత హైలైట్ అవుతాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
సినిమాలో మహిళా సాధికారత సందేశం
మొత్తం పైన ఉస్తాద్ భగత్ సింగ్.. సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. కథలో చేసిన మార్పులు, పవర్‌ఫుల్ సీన్లు ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. కథలో చేసిన మార్పులు మరియు పవర్‌ఫుల్ సీన్లు ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.


