|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Anusha Ratnam: ఎవడ్రా బిగ్‌బాస్‌.. కట్‌ చేస్తే ఛాన్స్‌ ఇవ్వమని ఏడుపు!

Published: 28-08-2025, 10:18 AM
Anusha Ratnam: ఎవడ్రా బిగ్‌బాస్‌.. కట్‌ చేస్తే ఛాన్స్‌ ఇవ్వమని ఏడుపు!

బిగ్ బాస్ తొమ్మిదో సీజన్‌కు అనూష రత్నం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాలని ఆమె కోరుకుంటోంది. గతంలో బిగ్ బాస్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Key Points

1

అనూష రత్నం బిగ్ బాస్ 9లో అవకాశం కోసం ప్రయత్నిస్తోంది.

2

అగ్నిపరీక్ష షో ద్వారా బిగ్ బాస్ 9లో ప్రవేశించే అవకాశం కోసం పోటీ పడుతోంది.

4

అనూష యొక్క జీవిత కథ మరియు ఆమె ప్రయత్నాల గురించి కథనం వివరిస్తుంది.

అనూష రత్నం యొక్క బిగ్ బాస్ 9 ప్రయాణం

మరికొద్దిరోజుల్లో బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ (Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను కన్‌ఫార్మ్‌ చేసేశారు. అయితే తారలు మాత్రమే ఉంటే ఎలా? సామాన్యులు కూడా ఉండాలని ఆలోచించారు. ఎవరో ఒకర్ని కాకుండా అగ్నిపరీక్ష అనే షో పెట్టి అందులో తమ సత్తా చూపించినవారికే రియాలిటీ షోలో అడుగుపెట్టే ఛాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ అగ్నిపరీక్ష మొదలైంది. 15 మంది మధ్య పోటీ జరుగుతోంది.

ఓటేయండి ప్లీజ్‌ వీరిలో ఇన్‌ఫ్లుయెన్సర్‌ అనూష రత్నం ( Anusha Ratnam ) కూడా ఉంది. తాజాగా హాట్‌స్టార్‌ ఆమె ఓట్‌ అప్పీల్‌ చేసిన వీడియో రిలీజ్‌ చేసింది. అందులో అనూష మాట్లాడుతూ.. ఉద్యోగం చేశా, ట్యూషన్‌ టీచర్‌గా చేశా.. కంటెంట్‌ క్రియేటర్‌గానూ పని చేశాను. మీలో ఒకరిగా సోషల్‌ మీడియాలో ఎంటరయ్యాను. ప్రతి తెలుగింటికి నా గొంతు వినిపించాలంటే నన్ను బిగ్‌బాస్‌లోకి పంపించాలి. బిగ్‌బాస్‌కు నన్ను పంపించాలంటే ఓటింగ్‌ ముఖ్యం. కాబట్టి నాకు ఓటు వేసి పంపించండి.

అగ్నిపరీక్ష షోలో ఆమె పోటీ

గర్వపడేలా చేస్తా.. ఈమెను ఎందుకురా పంపించాం? అని నిరాశ చెందకుండా గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా.. మీ ఇంటి ఆడపిల్ల అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను అంటూ తనకు ఓటేయమని వేడుకుంది. అనూష రత్నం వరంగల్‌ అమ్మాయి. తండ్రి మరణించడంతో చెల్లి చదువు బాధ్యతను తనే భుజాన వేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన ఆమె తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది. ఇటీవల వర్జిన్‌ బాయ్స్‌ మూవీ ఈవెంట్‌లో యాంకరింగ్‌ కూడా చేసింది.

ఎవడ్రా బిగ్‌బాస్‌? బిగ్‌బాస్‌కు వెళ్లాలని తహతహలాడుతున్న ఈమె గతంలో ఈ షోపై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తెలుగు బిగ్గెస్ట్‌ రియాలిటీ షో ఏదంటే? అందరూ బిగ్‌బాస్‌, బిగ్‌బాస్‌ అని బట్టలు చించేసుకుంటున్నారు. ఎవడ్రా బిగ్‌బాస్‌ అని హేళన చేసింది. కట్‌ చేస్తే అదే షోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన లైఫ్‌ స్టోరీ చెప్తూ ఎమోషనల్‌ కావడంతో ఆమెను నేరుగా టాప్‌ 15కి పంపించారు.

గత వ్యాఖ్యలు మరియు ప్రస్తుత ఆశలు

అప్పుడు విష్ణుప్రియ.. ఇప్పుడు అనూష అక్కడినుంచి నేరుగా బిగ్‌బాస్‌ 9కి పంపమని వీడియోలు చేస్తోంది అనూష. మరి తను బిగ్‌బాస్‌ 9లో ఉంటుందా? లేదా? అనేది చూడాలి! గతంలో విష్ణుప్రియ కూడా.. షోకి వెళ్లేదే లేదని తెగేసి చెప్పింది. కట్‌ చేస్తే గత సీజన్‌లో ప్రత్యక్షమైంది. ఆట ఆడకుండా పిక్నిక్‌కు వచ్చినట్లు కూర్చుంది. మరి ఈ అనూష షోకి వెళ్తుందా? వెళ్తే ఎలా ఆడుతుంది? అన్నది చూడాలి!

అనూష రత్నం బిగ్ బాస్ 9లోకి ప్రవేశించగలదా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె ప్రయత్నాలు, నిర్ణయాలు మరియు ఆమె భవిష్యత్తు ఏమిటి అనేది చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.