
📌 Key Points
- అనుష్క శెట్టి ‘కథనార్’ ట్రైలర్ అప్డేట్: మార్చి 31న ఉదయం 13:31 గంటలకు విడుదల!
- జైసూర్య హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 3D టెక్నాలజీతో రూపొందుతోంది.
- 15 భాషల్లో విడుదల కానున్న ‘కథనార్’: తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా రిలీజ్!
- రామానంద్ కథ, రోజిన్ థామస్ దర్శకత్వం: 9వ శతాబ్దపు క్రైస్తవ మతగురువు జీవితం ఆధారంగా చిత్రం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న ‘కథనార్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మార్చి 31న ట్రైలర్ విడుదల: వేచి చూడండి!
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి నటించిన మలయాళ చిత్రం ‘కథనార్’. భారీ బడ్జెట్‌తో 3D టెక్నాలజీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జైసూర్య హీరోగా కనిపించనున్నాడు. మలయాళంతో పాటు తెలుగు , తమిళం, హిందీ, ఇంగ్లీష్‌తో సహా ఏకంగా 15 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న ఈ పౌరాణిక కథాశం నుంచి తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘మౌనాన్ని ఛేదించడానికి ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది.. అఫీషియల్ ట్రైలర్ మార్చి 31న 13:31 గంటలకు రాబోతున్నది’ అంటూ ప్రకటించారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. అనుష్క విధ్వంసం కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
కాగా.. రామానంద్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇది మొదటిది. 9వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనాత్ జీవితం ఆదారంగా రూపొందుతోన్న ఈ మూవీలో అనుష్క శెట్టి ‘నీలా’ పాత్రలో కనిపించనుంది. శ్రీ గోకులం మూవీస్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. కస్టమ్-బిల్డ్ స్టూడియోలో వర్చువర్ ప్రొడక్షన్ టెక్సాలజీని ఉపయోగించి చిత్రీకరించబడింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 2023లోనే స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అనుష్క శెట్టి ఫ్యాన్స్.
‘కథనార్’తో అనుష్క సంచలనం ఖాయమా?
15 భాషల్లో విడుదల: భారీ అంచనాలు!
అనుష్క శెట్టి ‘కథనార్’ ట్రైలర్ అప్డేట్ తో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


