|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజుగారి కలెక్షన్ల సునామీ! రెండు రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ వసూళ్లు!!

Published: 16-01-2026, 5:00 AM
రాజుగారి కలెక్షన్ల సునామీ! రెండు రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ వసూళ్లు!!
  • నవీన్ పోలిశెట్టి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతికి విడుదలైంది.
  • ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.41.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
  • నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
  • మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.41.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.

రెండు రోజుల్లో భారీ వసూళ్లు

AOR 2days Collections: చివరిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్ పోలిశెట్టి (Naveen Polisetty) రెండేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ముఖ్యంగా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా థియేటర్ కి ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. ఇకపోతే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి మళ్ళీ తన కామెడీ ట్రాక్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా రెండు రోజుల్లోనే ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటిరోజు రూ.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.41.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక ప్రకటన చేసింది. మారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. మొత్తానికైతే రెండు రోజుల్లోనే 41 కోట్లు రాబట్టడంతో అభిమానులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండక్కి రాజుగారి హవా కొనసాగుతోంది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

సినిమాకు పాజిటివ్ టాక్

గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో ఒక జమిందార్ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి ఏకైక వారసుడు రాజు (నవీన్ పోలిశెట్టి). అయితే అతని తాత దానధర్మాలు చేసి ఆస్తి అంతా కోల్పోతాడు. ఇక డబ్బు పోయినా పరువు మాత్రమే మిగులుతుంది. ఇక ఆ పరువును కాపాడుకుంటూ తాను ఇప్పటికీ కోటీశ్వరుడినే అన్నట్టు ఊరి జనాలను నమ్మిస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అలాంటి రాజుకు ఒక పెళ్లిలో బంధువుల వల్ల అవమానం జరుగుతుంది. ఇక దాంతో కోటీశ్వరుడు ఇంటికి అల్లుడిని అవుతానని, గత వైభవాన్ని తిరిగి తెస్తానని, మొదటి శుభలేఖ మీకే ఇస్తానని సవాలు విసిరి.. కోటీశ్వరుడి ఇంటికి అల్లుడు అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు. అదే సమయంలో పక్క ఊరి జమీందారు ఏకైక కుమార్తె చారులత (మీనాక్షి చౌదరి) తారసపడుతుంది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇక ఇంట్లో ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటారు. పెళ్లి అయ్యాక రాజుకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఇక అదేంటి? రాజు కోటీశ్వరుడు ఇంటికి అల్లుడు అయ్యాడా? గత వైభవాన్ని తిరిగి సాధించాడా ? బంధువుల కు విసిరిన సవాల్ లో నెగ్గాడా అనే విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నవీన్ పోలిశెట్టి కామెడీ అదుర్స్

మొత్తానికి ‘అనగనగా ఒక రాజు’ సినిమా రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించి సంక్రాంతి బరిలో నిలిచింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.