
📌 Key Points
- ఏపీ ఈసెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు.
- పరీక్షకు హాజరైన 32,434 మందిలో 29,750 మంది ఉత్తీర్ణత సాధించారు (96.09%).
- హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా ర్యాంక్ కార్డును క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- జూన్ లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది, పత్రాలు సిద్ధం చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈసెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన విద్యారంగంలో ఈ ఫలితాలు విద్యార్థులకు నూతన అవకాశాలను కల్పిస్తున్నాయి. లోకేశ్ ప్రకటనతో వేలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.
ఈసెట్ ఫలితాల విడుదల: లోకేశ్ ప్రకటన
AP ECET Download Rank Card 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈసెట్ (APECET) 2026 ఫలితాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) తరపున జేఎన్‌టీయూ అనంతపురం ఈ పరీక్షను గత నెల ఏప్రిల్ 23న విజయవంతంగా నిర్వహించింది. ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించగా… ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఫలితాలను ప్రకటించారు.
ఈ ఏడాది పరీక్షకు మొత్తం 33,751 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా…. 32,434 మంది (96.09%) హాజరయ్యారు. వీరిలో 29,750 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గినప్పటికీ, విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని అధికారులు వెల్లడించారు.
ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ విధానం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల గణాంకాలను పరిశీలిస్తే…. అత్యధికంగా హైదరాబాద్ ప్రాంతం (రాష్ట్రం వెలుపల పరీక్షా కేంద్రం) నుంచి 97.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక రాష్ట్రంలోని జిల్లాల్లో కృష్ణా (95.43%), ఎన్టీఆర్ (92.10%), విశాఖపట్నం (93.30%) జిల్లాలు ఉత్తమ ఫలితాలను కనబరిచాయి.
ఇక ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు మనమిత్ర వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా క్షణాల్లోనే మీ ర్యాంక్ కార్డును చెక్ చేసుకోవచ్చు.
త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్
ఏపీ ఈసెట్ ఫలితాల విడుదలైన నేపథ్యంలో… త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారవుతుంది. ప్రాథమిక సమాచారం మేరకు… జూన్ లో ఈ ప్రాసెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులు, హాల్ టికెట్లు మరియు విద్యార్హత ధృవపత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర అప్డేట్స్ కోసం https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా విడుదలైన ఈ ఫలితాలు విద్యార్థులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు తమ పత్రాలను సిద్ధం చేసుకుని, ఉన్నత విద్యకు సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర భవిష్యత్తుకు ఇది శుభసూచకం.


