|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏపీ కొత్త మ్యాప్ లీక్ కలకలం! APSDMA సంచలన ప్రకటన!

Published: 06-04-2026, 4:35 AM
ఏపీ కొత్త మ్యాప్ లీక్ కలకలం! APSDMA సంచలన ప్రకటన!
  • 28 జిల్లాల కొత్త మ్యాప్ విడుదల అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు.
  • ఈ మ్యాప్‌ను APSDMA విడుదల చేయలేదని స్పష్టం చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ.
  • ప్రచారంలో ఉన్న సమాచారం అవాస్తవమని, నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి.
  • అధికారిక సమాచారం కోసం APSDMA ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచన.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 28 జిల్లాలతో కూడిన నూతన మ్యాప్‌ను ఏపీఎస్‌డీఎంఏ విడుదల చేసిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన విపత్తుల నిర్వహణ సంస్థ ఇది ఫేక్ అని తేల్చి చెప్పింది. ఇలాంటి నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

వైరల్ అవుతున్న 28 జిల్లాల మ్యాప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ 28 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ నూతన మ్యాప్‌ను విడుదల చేసిందని పేర్కొంటూ ఇటీవలే వార్తలు వైరల్ అయ్యాయి. చాలా ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాలోనూ మ్యాప్ ఫొటోలు కనిపించాయి.

ఈ వార్తలపై సోమవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పందించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తరపున అటువంటి మ్యాప్ ఏదీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అలాంటి సమాచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. తప్పుదోవ పట్టించేలా ఉన్న అలాంటి సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరింది.

ఖండించిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

APSDMA పేరు,లోగోతో షేర్ చేయబడుతున్న ఆ మ్యాప్ ప్రామాణికమైనది కాదని తెలిపింది. ప్రజలు, మీడియా సంస్థలు, సంబంధిత వర్గాలందరూ ఇటువంటి ధృవీకరించని సమాచారాన్ని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. విపత్తుల సంస్థ జారీ చేసే అధికారిక సమాచారంతో పాటు ప్రచురణలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.

గతంలో ఏపీలో ఉన్న 26 జిల్లాలకు అదనంగా.. ఇటీవల మార్కాపురం , పోలవరం జిల్లాలుగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది.ఈ రెండు జిల్లాల సరిహద్దులను కూడా ప్రచారం చేయబడిన మ్యాప్‌లో పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన నేపథ్యంలో… ఈ ఫొటోను చాలా మంది షేర్ చేశారు. అయితే ఈ వార్తలు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ దృష్టికి వెళ్లటంతో… ఇవాళ ప్రకటన విడుదలైంది. తాము ఎలాంటి మ్యాప్ విడుదల చేయలేదని… ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరింది.

నమ్మొద్దని ప్రజలకు APSDMA విజ్ఞప్తి

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

ఏపీఎస్డీఎంఏ విడుదల చేయని మ్యాప్‌ను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలని కోరారు. తప్పుడు సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.