
📌 Key Points
- రాష్ట్రంలో కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.6,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటన.
- విజయనగరంలో 220/132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం.
- రాష్ట్రవ్యాప్తంగా లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 200 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం.
- పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడానికి ప్రభుత్వం సబ్ స్టేషన్ల నిర్మాణానికి కట్టుబడి ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.6,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దీని ద్వారా లో-వోల్టేజ్ సమస్యలు తొలగిపోతాయి.
కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లు ఖర్చు చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విజయనగరంలో వేణుగోపాలపురం వద్ద 220/132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణంపై సభ్యులు అదితి విజయలక్ష్మీ గజపతిరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు వేణుగోపాలపురం 220/132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం రీ టెండరింగ్ ప్రక్రియలో ఉందన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
‘ ప్రాజెక్టులు పూర్తికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని పని చేస్తున్నాం. వేణుగోపాలపురం సబ్ స్టేషన్ నిర్మాణం మార్చి 2027 నాటి పూర్తి చేస్తాం. విజయనగరానికి అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఖర్చుతో కూడుకున్నది. అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఆవశ్యకత, నిధుల అందుబాటును బట్టి పరిశీలిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా లోడ్ ఎక్కువగా ఉన్న ప్రతీ చోట 33/11 కేవీ సబ్ స్టేషన్లు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 200 సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నాం.’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
విజయనగరంలో సబ్ స్టేషన్ నిర్మాణంపై ప్రకటన
భవిష్యత్తు విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఈ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. విజయనగరం జిల్లాలో రూ. 46 కోట్ల విలువైన రెండు 220 కేవీ పనులు జరుగుతున్నాయని సభకు తెలిపారు. పారిశ్రామిక, వ్యాపార, గృహ, వ్యవసాయ వినియోగదారుల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోందని, పెరుగుతున్న భవిష్యత్ విద్యుత్ డిమాండ్ కు తగినట్లు సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని చర్యలు
విద్యుత్ సరఫరా డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు రానున్నాయి. భవిష్యత్ డిమాండ్‌ను అధిగమించడానికి ఈ ప్రాజెక్టులను రూపొందించింది ప్రభుత్వం. పరిశ్రమ, వ్యాపారం, గృహ, వ్యవసాయ రంగాల నుండి విద్యుత్ డిమాండ్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది. కొత్త సబ్ స్టేషన్లదో ఓవర్ లోడ్ సమస్య తిరి.. లో వోల్టేజీ విద్యుత్ లేకుండా ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల ద్వారా ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందనుంది. లో-వోల్టేజ్ సమస్యలు తొలగిపోయి, పరిశ్రమలు మరియు గృహ అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉండనుంది.


