|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సముద్రంలో ఏపీ సర్కార్ స్ట్రోక్: తమిళనాడు, పాండిచ్చేరి మత్స్యకారులకు చెక్!

Published: 31-03-2026, 10:35 AM
సముద్రంలో ఏపీ సర్కార్ స్ట్రోక్: తమిళనాడు, పాండిచ్చేరి మత్స్యకారులకు చెక్!
  • తమిళనాడు, పాండిచ్చేరి మత్స్యకారుల అక్రమ వేటను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
  • కోటి రూపాయల విలువైన హై స్పీడ్ బోటును కృష్ణపట్నం ఓడరేవుకు ప్రభుత్వం తరలించింది.
  • గంటకు 18 కి.మీ వేగంతో గస్తీ కాస్తూ అక్రమ వేటకు అడ్డుకట్ట వేయనున్నారు.
  • సముద్ర తీరంలో మూడు బోట్లతో టాస్క్‌ఫోర్స్ బృందాలు రాత్రి వేళల్లో తనిఖీలు చేస్తాయి.

బంగాళాఖాతంలో తమిళనాడు, పాండిచ్చేరి మత్స్యకారుల అక్రమ చేపల వేటను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రత్యేక నిఘా కోసం హై స్పీడ్ బోటును రంగంలోకి దించింది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

అక్రమ వేటపై ఏపీ సర్కార్ కొరడా

బంగాళాఖాతంలో పొరుగు రాష్ట్రాల మత్స్యకారుల అక్రమ చేపల వేటను నిరోధించేందకు ఏపీ ప్రభుత్వం పటిష్ట భద్రత చర్యలు తీసుకుంది. తమిళనాడు, పాండిచ్చేరి మత్స్యకారుల అక్రమ వేట పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ హై స్పీడ్ బోటును రంగంలోకి దించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మంగళవారం కృష్ణపట్నం ఓడరేవుకు సుమారు కోటి రూపాయల విలువైన హై స్పీడ్ బోటు వచ్చింది. కాకినాడ హార్బర్ నుంచి నెల్లూరు జిల్లాకు హై స్పీడ్ బోటును మత్స్య శాఖ అధికారులు తీసుకువచ్చారు.

326 హెచ్‌పి హైస్పీడ్ బోటుతో గంటకు 18 కి.మీ. వేగంతో నిరంతరం గస్తీ కాస్తూ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల మత్స్యకారుల అక్రమ వేటకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకున్నారు. వీడియో రికార్డింగ్ సౌకర్యంతో కూడుకున్న బైనాక్యూలర్లు, హెవీ ఫోక్స్ లైట్లతో తమిళనాడు, పాండిచ్చేరి మత్స్యకారుల కదలికలపై నిరంతరం నిఘాపెట్టే విధంగా హై స్పీడ్ బోటు పనిచేస్తుంది. సముద్ర తీరంలో మూడు బోట్లతో టాస్క్‌ఫోర్సు బృందాలు గస్తీ నిర్వహిస్తూ రాత్రి వేళల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరో నూతన హై స్పీడు బోటు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు మత్స్య శాఖ అధికారులు తెలిపారు.

హై స్పీడ్ బోటుతో నిఘా

సముద్ర తీరంలో టాస్క్‌ఫోర్స్ గస్తీ

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు సముద్ర జలాల పరిరక్షణకు, స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలకు ఎంతవరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి. భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేయనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.