|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్: ఆ ప్రశ్నలు రాస్తే చాలు, 6 మార్కులు మీ ఖాతాలో! ఫలితాల విడుదల ఎప్పుడో తెలుసా?

Published: 04-04-2026, 10:35 PM
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్: ఆ ప్రశ్నలు రాస్తే చాలు, 6 మార్కులు మీ ఖాతాలో! ఫలితాల విడుదల ఎప్పుడో తెలుసా?
  • ఏపీ టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం కానుంది.
  • హిందీ, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాల్లోని తప్పులకు సంబంధించి విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపనున్నారు.
  • సమాధానం రాసిన విద్యార్థులందరికీ హిందీకి 2 మార్కులు, ఇంగ్లీష్‌కు 4 మార్కులు కలుపుతారు.
  • ఏప్రిల్ 25 తర్వాత టెన్త్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది; ఫలితాలు వెబ్‌సైట్‌లో మరియు వాట్సాప్‌లో తెలుసుకోవచ్చు.

ఏపీ టెన్త్ పరీక్షలు ముగియడంతో, జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కానుంది. హిందీ మరియు ఇంగ్లీష్ ప్రశ్నపత్రాల్లోని తప్పులకు గ్రేస్ మార్కులు ఇవ్వనున్నారు. ఫలితాలు ఏప్రిల్ 25 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.

జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

ఏపీ టెన్త్ పరీక్షలు ముగిశాయి. ఈ నేపథ్యంలో జవాబు పత్రాల మూల్యాంకనం కోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 15వ తేదీతో ముగుస్తుంది. ఈ మేరకు కార్యాచరణను ఫైనల్ చేశారు.

ఇక పదో తరగతి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో…. పలు ప్రశ్నలపై ప్రభుత్వ పరీక్షల విభాగానికి అభ్యంతరాలు అందాయి. హిందీ పేపర్‌లో ప్రశ్నలు 3, 6 బిట్లలో కింద ఇచ్చిన ఐచ్ఛికాల్లో అక్షర దోషాలున్నట్లు రాగా… ఇంగ్లీష్ ఎగ్జామ్ విషయంలో మరో అభ్యంతరం వ్యక్తమైంది. క్వశ్చన్ పేపర్ లో 28వ ప్రశ్న(4 మార్కులు) పాఠ్యపుస్తకం నుంచి కాకుండా వర్క్‌బుక్‌ నుంచి ఇచ్చినట్లు పరీక్షల విభాగం దృష్టికి వచ్చింది. ఈ ఫిర్యాదులను సబ్జెక్టు నిపుణుల కమిటీకి పంపారు. పరిశీలిన తర్వాత…. ఆయా ప్రశ్నలకు మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది.

గ్రేస్ మార్కులపై విద్యాశాఖ ప్రకటన

సబ్జెక్ట్ నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాత…. హిందీ సబ్జెక్టుకు రెండు మార్కులు కలుపుతారు. ఇక ఇంగ్లీష్ సబ్జెక్టుకు 4 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. అయితే విద్యార్థులు ఆయా ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉండాలని…. జవాబు తప్పైనా మార్కులు ఇస్తారు. అటెంప్ట్ చేసిన వాళ్లకే ఈ మార్కులు కలుస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

గతేడాదిలో ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఏప్రిల్ 15వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కానుంది. ఫలితాలను ప్రాసెస్‌ చేయడానికి వారానికి పైగా సమయం పటొచ్చు. ఇది కూడా పూర్తి కాగానే ఈనెల 25వ తేదీ తర్వాత ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే… నెలాఖారులోపే ఫలితాలను ప్రకటించవచ్చు.

ఫలితాల విడుదల తేదీ ఎప్పుడంటే?

ఏపీ టెన్త్ ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్(9552300009) లో కూడా అందుబాటులో ఉంటాయి.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

ఏపీ టెన్త్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది ముఖ్యమైన సమాచారం. గ్రేస్ మార్కులను సద్వినియోగం చేసుకొని, ఫలితాల కోసం వేచి ఉండండి. ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.