|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు! ఏ జిల్లాల్లో వర్షాలు? ఎక్కడ వడగాలులు?

Published: 04-04-2026, 9:05 PM
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు! ఏ జిల్లాల్లో వర్షాలు? ఎక్కడ వడగాలులు?
  • ఉత్తరాంధ్రలో రాగల మూడు రోజుల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • తెలంగాణలోని పలు జిల్లాలకు IMD ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
  • ఏప్రిల్ 9 నుంచి తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
  • 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో IMD హెచ్చరికలు

వాతావరణశాఖ మరోసారి కీలక అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలుండగా… మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది. ఈ మేరకు హెచ్చరికలను జారీ చేసింది.

తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఉత్తరాంధ్రకు వర్ష సూచన

ఇక తెలంగాణలో ఏప్రిల్ 9వ తేదీ నుంచి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి వర్ష సూచన ఉండదని పేర్కొంది.

మరోవైపు ఉత్తరాంధ్రకు వర్ష సూచన ఉంది.సోమవారం నుంచి 3రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

రాష్ట్రంలో వడగాల్పులు

ఇక ఇవాళ 17 మండలాల్లో తీవ్రవడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.