
ఆంధ్రప్రదేశ్‌లో రాగల గంటల్లో వాతావరణం కీలక మార్పులకు లోనుకానుంది. రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Key Points
రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావం.
రాయలసీమ, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం.
బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దని ప్రత్యేక హెచ్చరిక.
రాగల గంటల్లో ఏపీలో వాతావరణ మార్పులు
రాష్ట్రవ్యాప్తంగా రాగల కొన్ని గంటల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది .
ఆదివారం(జూన్ 21) నాటి వాతావరణ అంచనాల ప్రకారం….. రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడా చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చు.
ద్రోణి ప్రభావం: వర్షాలు, పిడుగుల హెచ్చరికలు
మరికొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో కూడా పిడుగులు పడే అవకాశంతో పాటు తేలికపాటి వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వర్షం కురిసే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి రాగల మూడు గంటల కాలానికి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక అలర్ట్‌లను జారీ చేసింది.
ప్రజలకు విపత్తుల సంస్థ సూచనలు, భద్రతా చర్యలు
ఈ జిల్లాల్లోని ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దన అధికారులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
ఏపీలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో, ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి. విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటించి, సురక్షితంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.


