
లేడీ సూపర్ స్టార్ సమంత రూత్ ప్రభు నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది! తొలిరోజే ఊహించని వసూళ్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సమంత కమ్‌బ్యాక్ బ్లాక్ బస్టర్ అని నిరూపించుకుంది.
Key Points
'మా ఇంటి బంగారం' తొలిరోజు రూ.13.15 కోట్ల గ్రాస్ వసూళ్లు.
సమంత కెరీర్‌లో బిగ్గెస్ట్ సోలో ఓపెనింగ్ రికార్డు.
ఏపీ, తెలంగాణలో రూ.4.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు.
ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.4.50 కోట్ల భారీ వసూళ్లు.
రికార్డుల సునామీ సృష్టించిన సమంత!
Maa Inti Bangaram Day 1 Collections: లేడీ సూపర్ స్టార్ సమంత రూత్ ప్రభు తన ఓన్ బ్యానర్ ‘ట్రాలా లా మూవింగ్ పిక్చర్స్’ పై నిర్మించి, నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.
Maa Inti Bangaram Day 1 Collections: ఇది కదా కమ్ బ్యాక్ అంటే! అవును.. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగు సినిమాతో థియేటర్లకు వచ్చిన సమంత అదరగొడుతోంది. మా ఇంటి బంగారం మూవీతో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్లు చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా షాక్ అవుతున్నారు.
మా ఇంటి బంగారం కలెక్షన్లు
చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా డే 1 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. సమంత కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ సోలో ఓపెనింగ్స్ కావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా ‘మా ఇంటి బంగారం’ వసూళ్లు!
వరల్డ్ వైడ్ గ్రాస్- రూ.13.15 కోట్లు
నెట్ వసూళ్లు- రూ.5.35 కోట్లు
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ గ్రాస్- రూ.4.75 కోట్లు
కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
ఓవర్సీస్ గ్రాస్ మార్కెట్- రూ.4.50 కోట్లు
తెలుగు వెర్షన్ కాంట్రిబ్యూషన్-రూ. 5.15 కోట్లు
లేడీ సూపర్ స్టార్ల బాక్సాఫీస్ రేస్
‘మా ఇంటి బంగారం’ సినిమా మొదటిరోజు కలెక్షన్లతోనే తన సత్తా చాటింది. సమంత కెరీర్‌లోనే ఇది ఓ మైలురాయి. మరిన్ని బాక్సాఫీస్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి!


