
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ‘రావు బహదూర్’ సినిమా గురించే! సత్యదేవ్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాటలు వింటే మీరు షాక్ అవుతారు!
Key Points
'రావు బహదూర్' జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల; మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరో.
మహేష్ బాబు 40 నిమిషాలు సినిమా గురించి మాట్లాడి, 'మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా' అన్నారు.
సత్యదేవ్ 'రామప్ప' పాత్రకు 5 గంటల మేకప్; కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన పాత్ర.
వెంకటేష్ మహా దర్శకత్వంలో సైకాలజికల్ థ్రిల్లర్; మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ జానర్స్.
మహేష్ బాబు ప్రశంసలు: ‘రావు బహదూర్’ సంచలనం!
సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వంలో ఈ సైకాలజికల్ థ్రిల్లర్ రూపొందింది. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ‘రావు బహదూర్’ ఒక సైకాలజికల్ డ్రామా అని.. మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్ జానర్స్‌గా ఉంటాయని సత్యదేవ్ తెలిపారు. ”ఇది 1960–99 మధ్య జరిగే కథ. ఇందులో కథానాయకుడు ఒక దేశసంచారి. అలా సంచారం చేస్తూ మళ్లీ తన ప్యాలెస్ భువనాలయానికి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరం” అంటూ సినిమా స్టోరీ లైన్ రివీల్ చేశారు. ఇందులో తాను రామప్ప అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నానని, అది వెరీ మ్యాడ్ క్యారెక్టర్ అని, తన కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ పాత్ర అని చెప్పారు. సినిమా చేస్తున్నప్పుడు రామప్ప తనను ఆవహించాడేమో అన్నంతగా ఆ పాత్రలో లీనమైపోయానన్నారు. ‘రావు బహదూర్’ మూవీలో ప్రతి సీన్ చాలా డీటైలింగ్ గా ఉంటుందని, వెంకటేష్ మహా ప్రతి లేయర్‌ను చాలా అద్భుతంగా రాసుకున్నారని, అంతే అద్భుతంగా తీశారని సత్యదేవ్ తెలిపారు. మహేష్ బాబు మూవీ చూసిన తర్వాత ‘మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా’ అని అన్నారని, సినిమా రిపీట్‌గా చూసేలా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ తన కెరీర్‌లో ‘జ్యోతిలక్ష్మి’ సినిమాకి ముందు, ఆ తర్వాత అని చూసుకునేవాడినని.. ఇప్పుడు ‘రావు బహదూర్’కి ముందు, రావు బహదూర్‌కి తర్వాత అన్నట్టుగా చూస్తారని నమ్ముతున్నానన్నారు సత్యదేవ్. మామూలుగా చేసే సినిమాల కంటే 300 శాతం ఎక్కువగా ఈ సినిమాకు కష్టపడ్డానని, హెవీ మేకప్ వేసుకున్నానని సత్యదేవ్ తెలిపారు. ”కమల్ హాసన్, సూర్య, విక్రమ్ హెవీ మేకప్ సినిమాలు ప్రయత్నిస్తుంటారు. నేను కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా చేయాలని అనుకునేవాడిని. నేను యాక్టర్ అయినప్పటి నుంచి అది నా డ్రీమ్. ఆ అవకాశం ‘రావు బహదూర్’ సినిమాతో వచ్చింది. నా క్యారెక్టర్‌కు మేకప్ వేయడానికి 5 గంటలు పట్టేది, తీయడానికి గంటన్నర పట్టేది. ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా సహనం కావాలి. ఈ సినిమా చేసిన తర్వాత నాకు కూడా చాలా సహనం ఉందని అర్థమైంది” అంటూ నవ్వుతూ అన్నారు. ”మహేష్ బాబు, నమ్రత కలిసి ఈ సినిమా చూశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ మూవీ గురించి మాట్లాడారు. మహేష్ టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే సుకుమార్ కూడా సినిమా చూసి మంచి రివ్యూ ఇచ్చారు. ‘ప్రతి ఒక్కరూ డ్యూటీ చేస్తే సినిమా ‘రావు బహదూర్’లా ఉంటుంది’ అని నాని అన్నారు. మహేష్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేశాను. కాకపోతే అందులో నా సీన్ కట్ అయింది. అలాంటి మహేష్ ఇప్పుడు నా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. మహేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది. నిర్మాతలు శరత్, అనురాగ్, గోపాల్ కి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్లే ఈ సినిమాకి మహేష్ బాబుని తీసుకొచ్చారు. నా గత చిత్రాలకు మార్కెట్ విషయంలో కొన్ని ఇబ్బందులు పడ్డాను. కానీ ఈ మూవీకి మాత్రం అన్ని వాళ్లే తమ భుజాలపై వేసుకుని చాలా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు” అని సత్యదేవ్ అన్నారు. తమిళం, మలయాళం నుంచి కొత్త రకం సినిమాలు వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. మన దగ్గర ఎందుకు ఇలాంటి కొత్త రకం సినిమాలు తీయరని డిస్కషన్ పెడతారు. అలాంటి వారందరికీ ‘రావు బహదూర్’ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉంది” అని సత్యదేవ్ ధీమా వ్యక్తం చేశారు.
సత్యదేవ్ కెరీర్‌లో మైలురాయి: ‘రామప్ప’ పాత్ర విశేషాలు
5 గంటల మేకప్: సత్యదేవ్ డ్రీమ్ రోల్ సక్సెస్!
‘రావు బహదూర్’ సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. సత్యదేవ్ నటన, వెంకటేష్ మహా దర్శకత్వం సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్లాయో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!


