|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఓజీ నటుడి ప్రేమకు బ్రేకప్ చెప్పిన లవ్..వివాదంగా మారిన పోస్ట్!

Published: 13-03-2026, 9:35 AM
షాకింగ్: ఓజీ నటుడి ప్రేమకు బ్రేకప్ చెప్పిన లవ్..వివాదంగా మారిన పోస్ట్!
  • నటుడు అర్జున్ దాస్ ఇంస్టాగ్రామ్ స్టోరీలో బ్రేకప్ పోస్ట్ షేర్ చేశారు.
  • పవన్ కళ్యాణ్ ఓజి సినిమాలో అర్జున్ దాస్ నటించారు.
  • అర్జున్ దాస్ షేర్ చేసిన పోస్ట్ సినిమా ప్రమోషన్ అయి ఉంటుందని అభిమానుల అభిప్రాయం.
  • అర్జున్ దాస్ మొదట దుబాయిలో పనిచేసి, తరువాత నటుడిగా మారారు.

తమిళ నటుడు అర్జున్ దాస్, పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమాలో కూడా కనిపించారు. ఆయన తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో బ్రేకప్ పోస్ట్ పెట్టడంతో అది వైరల్ అవుతోంది. ఇది నిజంగా బ్రేకప్ పోస్టా లేక సినిమా ప్రమోషన్ స్టంటా అని అందరూ అనుకుంటున్నారు.

అర్జున్ దాస్ బ్రేకప్ పోస్ట్ వైరల్

Arjun Das: తమిళ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అర్జున్ దాస్ ఒకరు. ఇటీవల ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే. గంభీరమైన గొంతు కలిగిన అర్జున్ దాస్ ఓజి సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అర్జున్ దాస్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయనకు లవ్ బ్రేకప్ అయ్యింది అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అర్జున్ దాస్ ఇంస్టాగ్రామ్ స్టోరీ గా షేర్ చేసిన పోస్ట్ చూస్తుంటే ఈయన బ్రేకప్ బాధలో ఉన్నారని స్పష్టం అవుతుంది.

అర్జున్ దాస్త న ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. బ్రోకెన్ హార్ట్ ఎమోజిని షేర్ చేస్తూ.. “మనం ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తే వాళ్లు మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు?”అంటూ ఈయన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసినా అభిమానులు అసలు అర్జున్ దాస్ పోస్ట్ వెనుక గల కారణం ఏమిటి? కొంపతీసి ఈయనకు లవ్ బ్రేకప్ అయిందా? అంటూ అభిమానుల సందేహ వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం ఇదొక సినిమా ప్రమోషన్ కాబోలు అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఓజి సినిమాలో అర్జున్ దాస్ నటన

మరి అర్జున్ దాస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ బ్రేకప్ పోస్ట్ వెనుక గల కారణం ఏంటి అనేది తెలియాలి అంటే అర్జున్ దాస్ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అర్జున్ దాస్ విషయానికి వస్తే.. తమిళనాడులో జన్మించిన అర్జున్ దాస్ ఇండస్ట్రీ లోకి రాకముందు దుబాయిలో పనిచేసేవారు .ఇక సినిమాలపై ఆసక్తితో 2012లో ‘పెరుమాన్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక తమిళంలో అర్జున్ దాస్ ఖైతి, అన్బు, మాస్టర్, విక్రమ్ వంటి సినిమాలలో నటించిన నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

తన గొంతుతో ఫేమస్ అయిన అర్జున్ దాస్..

సినిమా ప్రమోషన్ అంటూ అభిమానుల సందేహాలు

అర్జున్ దాస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. తన గాంబీర్యమైన గొంతు ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారని చెప్పాలి. ఇటీవల ఈయన తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసినదే పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజి సినిమాలో నటించారు. మొదటిసారి పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం పలు తెలుగు సినిమాలలో కూడా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సినిమాల పరంగా బిజీగా ఉన్న అర్జున్ దాస్ సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ కి సంబంధించిన పోస్ట్ షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

అర్జున్ దాస్ తన బ్రేకప్ పోస్ట్ వెనుక గల కారణాన్ని వెల్లడిస్తేనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.