|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ కెరీర్ ఇక ముగిసినట్టేనా? ఉస్తాద్ ఎఫెక్ట్! భయంకరమైన పరిస్థితుల్లో పవన్!

Published: 09-04-2026, 11:35 AM
పవన్ కళ్యాణ్ కెరీర్ ఇక ముగిసినట్టేనా? ఉస్తాద్ ఎఫెక్ట్! భయంకరమైన పరిస్థితుల్లో పవన్!
  • పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీగా ఉండటం అభిమానులను టెన్షన్ పెడుతోంది.
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది.
  • పవన్ కళ్యాణ్ గతంలో తీసుకున్న అడ్వాన్సుల వల్లనే సినిమాలు చేస్తున్నారా అనే సందేహాలు ఉన్నాయి.
  • సురేందర్ రెడ్డి గత సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో ఆయన కెరీర్ ప్రమాదంలో పడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు పవన్ వరుసగా సినిమాలు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

పవన్ కళ్యాణ్ కెరీర్ డెంజర్ జోన్‌లో ఉందా?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇపుడు రెండు పడవల్లో జర్నీ చేస్తు ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టేస్తున్నాడు. ఒకవైపు పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా ఉంటూనే,మరోవైపు OG’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలని కంప్లీట్ చేశాడు. చేసిన మూడింట్లో ఓజి పర్లేదనిపిస్తే ‘హరిహర వీరమల్లు’,‘ఉస్తాద్ భగత్ సింగ్’లు మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయ్. ముఖ్యంగా ఉస్తాద్ డిజాస్టర్ పవన్ మార్కెట్ నే క్వశ్చన్ చేసింది, నేను గనుక సినిమా  చేయడం మొదలెడితే 100 కోట్లు వెరీ కామన్ అన్న పవన్ ఉస్తాద్ తో 50 కోట్లనే కనా కష్టంగా టచ్ చేసిన పరిస్థితి.

భయంతోనే పవన్ సినిమాలకు ఓకే చెబుతున్నారా?

ఇక ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పవన్  గతంలోనే పలువురు బడా నిర్మాతలకు డేట్స్ ఇచ్చి భారీగా అడ్వాన్సులు తీసుకున్నారు.ఇప్పుడు ఆ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే లీగల్ ఇబ్బందులు తప్పవనే భయంతోనే పవన్ సినిమాలకు ఓకే చెబుతున్నారా? అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.నిజానికి పవన్ చేతిలో ప్రస్తుతం కొత్త కథలేవీ లేవు. కానీ గతంలో అనౌన్స్ చేసి అటకెక్కిన సురేందర్ రెడ్డి ప్రాజెక్టును మళ్ళీ తెరపైకి తేవడం వెనుక అసలు కారణం ఇదేనని వినిపిస్తున్న టాక్ .

సైరా కూడా కాస్ట్ ఫెయిల్యూర్

ఇక సురేందర్ రెడ్డి విషయానికే వస్తే స్టైలిష్ డైరెక్టర్ అన్న పేరు ఉన్నప్పటికీ గత సినిమా ఏజెంట్ ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా అఖిల్ కి ఒక నైట్ మెర్ లా అయిపొయింది. ఇక అంతకు ముందు వచ్చిన సైరా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అయిన సినిమానే.దీంతో భారీ బడ్జెట్ సినిమాలను హ్యాండిల్ చేయడంలో ఈ స్టైలిష్ డైరెక్టర్ తడబడుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్.

నిర్మాతల ఒత్తిడితోనే పవన్ సినిమాలు చేస్తున్నారా?

ఆడియన్స్ కాసుల వర్షం కురిపించడం పక్కా

ఇపుడు ‘వకీల్ సాబ్’, ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమాలు పవన్ మళ్ళీ చేస్తే ఆడియన్స్ కాసుల వర్షం కురిపించడం పక్కా. పవన్ కి కావాల్సింది కూడా అదే.కానీ సురేందర్ రెడ్డి మార్క్ క్లాస్ ఎలిమెంట్స్ ఇప్పుడున్న పొలిటికల్ హీట్‌లో పవన్‌కు ఏమాత్రం సెట్ అవుతాయనేది మెగా ఫ్యాన్స్ ని వేదిస్తున్న ప్రశ్న. ఇక పవన్ ఆటిట్యూడ్, మేనరిజమ్స్‌ ని దృష్టిలో పెట్టుకొని  ‘పవర్‌ఫుల్’ స్క్రిప్ట్ రెడీ చేశామని మేకర్స్ హైప్ ఇస్తున్నారు కాని ఇది ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అని, కేవలం పవన్ ఇమేజ్‌ను వాడుకోవడానికే తప్ప కథలో కొత్తదనం ఏమీ లేదని ఇన్ సైడ్ టాక్. కేవలం ‘మాస్ మరియు క్లాస్’ అంటూ ఊరిస్తూ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే పాత ట్రిక్ నే ప్లే చేస్తున్నారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.

క్వాలిటీ లేని సినిమాలు చేయడం వల్ల

సురేందర్ రెడ్డితో పవన్ సినిమా సేఫ్ అవుతుందా?

ఇకపోతే ఒకవైపు  ఈ సినిమా  జూన్ లేదా జూలైలో మొదలవబోతుంది అని వినిపిస్తుంది.మరో వైపు పవన్ పొలిటికల్ షెడ్యూల్ చూస్తె ఎప్పుడు ఏ జిల్లాలో ఉంటాడో తెలీని పరిస్థితి.మరి ఇలాంటి స్థితిలో సినిమా మొదలైనా సాఫీగా సాగుతుందా అంటే అనుమానమే.కుదిరినప్పుడు రెండు రోజులు షూటింగ్ చేసి మిగతా రోజులు రాజకీయం చేస్తానంటే ఎలా ఉంటుందో ఉస్తాద్ రిజల్ట్ క్లియర్ కట్ గా చూపించింది.దీంతో అంత బిజీగా ఉండి ,గ్యాప్ లో క్వాలిటీ లేని సినిమాలు చేయడం వల్ల ఉన్న మార్కెట్ ని కాస్తా పవన్ తనకి తానుగా డ్యామేజ్ చేసుకుంటున్నాడంటున్నారు ట్రేడ్ పండితులు.

పవర్ స్టార్ కెరీర్ క్లోజ్ అయినట్టేనా

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఒకప్పుడు  బాక్సాఫీస్ దద్దరిల్లేది, గల్లా పెట్టె గలగల లాడేది. అలాంటిది ఇపుడు పవన్ సినిమాలు వచ్చినా పెద్దగా బజ్ క్రియేట్ కాని పరిస్థితి.ఇక ఇప్పుడు మాత్రం సురేందర్ రెడ్డి సినిమా కూడా ఏ మాత్రం తేడా కొట్టినా పవర్ స్టార్ కెరీర్ క్లోజ్ అయినట్టే అంటూ సెటైర్స్ వేస్తున్నారు యాంటి ఫ్యాన్స్.మరి ఈ సినిమాతో నైనా పవన్ తనని తానూ ప్రూవ్ చేసుకుంటాడా లేక ఆ సినిమాల్లాగే ఇది కూడా అని లైట్ తీసుకుంటాడా చూడాలి !

మొత్తానికి పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. ఆయన రాజకీయ భవిష్యత్తు, సినిమా కెరీర్ రెండూ ఆయనకు సవాలుగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.