
📌 Key Points
- రామ్ పోతినేని, భాగ్యశ్రీ నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
- మహాలక్ష్మి పాత్ర తన కెరీర్‌లోనే గొప్ప అవకాశం అని భాగ్యశ్రీ బోర్సే వెల్లడించింది.
- చిత్రంలో భాగం కానందుకు ఎంతో బాధపడేదాన్ని అని భాగ్యశ్రీ భావోద్వేగంగా చెప్పింది.
- భాగ్యశ్రీ నటనకు సినీ ప్రముఖుల, క్రిటిక్స్ నుంచి విశేష ప్రశంసలు దక్కుతున్నాయి.
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే హీరో, హీరోయిన్‌లుగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో మహాలక్ష్మి పాత్ర తన కెరీర్‌లోనే బెస్ట్ చాన్స్ అని భాగ్యశ్రీ బోర్సే పేర్కొంది. సినిమా విజయం, తన నటనకు దక్కిన ప్రశంసలపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ విజయ ప్రస్థానం
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరో, హీరోయిన్‌గా నటించిన మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే నుంచి భారీ బజ్ క్రియేట్ అయింది. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆంధ్రకింగ్ తాలూకా’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీసు వద్ద సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇక ఇందులో హీరోయిన్‌గా చేసి భాగ్యశ్రీ.. తన నటనకు మంచి రెస్పాన్స్ దక్కినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే మహాలక్ష్మి పాత్ర చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నట్లు వెల్లడించింది. సక్సెస్ మీట్‌లో భాగ్రశ్రీ ఈ సినిమా తనకు ఎంత ముఖ్యమో మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే నేను ఈ సినిమాలో నటించకపోయి ఉంటే చాలా బాధపడేదాన్ని.
భాగ్యశ్రీ బోర్సే: కెరీర్‌లో బెస్ట్ చాన్స్ ఇదే
నా కెరీర్‌లోనే నాకు దొరికిన మంచి చాన్స్ ఇది. ఇంత మంచి పాత్రను వదులుకుని ఉంటే కచ్చితంగా ఫీల్ అయ్యేదాన్ని. ఇందులో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నేను అలాంటి పాత్రలో కనిపించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను నిజజీవితంలో మహాలక్ష్మిగా లేనని రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నా. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టీమ్ లేకపోతే.. నేను లేను. ఈ బ్యూటిఫుల్ స్టోరీలో నన్ను భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె పాత్రపై సినీ ప్రముఖులు, ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రిటిక్స్ కూడా ఆమె నటనను మెచ్చుకుంటున్నారు. హిట్స్ సొంతం చేసుకోలేకపోయినా భాగ్యశ్రీ ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతోంది.
నటనకు ప్రశంసలు, మహాలక్ష్మి పాత్ర ప్రత్యేకత
A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse)
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంలో మహాలక్ష్మి పాత్రతో భాగ్యశ్రీ బోర్సే సినీరంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ సినిమా తన కెరీర్‌కు ఎంతో ముఖ్యమని, ప్రేక్షకుల ఆదరణ తనకు లభించడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.


