|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aryan Khan : తండ్రి లాగే దూసుకుపోతున్న కొడుకు.. షారుఖ్ తనయుడి ఆస్తి ఎన్ని కోట్లు తెలుసా?

Published: 12-10-2025, 6:41 AM
Aryan Khan : తండ్రి లాగే దూసుకుపోతున్న కొడుకు.. షారుఖ్ తనయుడి ఆస్తి ఎన్ని కోట్లు తెలుసా?

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తండ్రి లాగే వ్యాపారంలో దూసుకుపోతున్నాడు. 27 ఏళ్ల వయసులోనే ఆర్యన్ కోట్లలో ఆస్తిని సంపాదించాడు. అతని వ్యాపారాలు, లగ్జరీ ఆస్తులు, నెట్ వర్త్ వివరాలు ఈ కథనంలో చూడండి.

Key Points

1

ఆర్యన్ ఖాన్ నెట్ వర్త్ ప్రస్తుతం 80 కోట్ల పైనే.

2

'D యావోల్' అనే ఖరీదైన క్లాతింగ్ బ్రాండ్ స్థాపకుడు, దర్శకుడిగా కూడా మారాడు.

4

27 ఏళ్ల వయసులోనే షారుఖ్ ఖాన్ లాగా వ్యాపారంలో దూసుకుపోతూ ఆస్తులు పెంచుకుంటున్నాడు.

ఆర్యన్ ఖాన్: తండ్రికి తగ్గ తనయుడు

Aryan Khan : బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గతంలో డ్రగ్స్ వివాదంలో నిలిచి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ గా మీడియాలో ఉంటున్నాడు. తండ్రి హీరో అయితే కొడుకు డైరెక్షన్ ఎంచుకున్నాడు. ఆర్యన్ ఖాన్ ఇటీవలే ది బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా మారాడు. ఈ సిరీస్ అంతగా మెప్పించలేదు.(Aryan Khan)

అయితే ఆర్యన్ ఖాన్ కూడా తండ్రిలాగే తన నెట్ వర్త్ పెంచుకుంటున్నాడు. షారుఖ్ ఖాన్ 12 వేల 490 కోట్ల విలువ చేసే ఆస్తులతో వరల్డ్ లోనే టాప్ యాక్టర్ గా నిలిచాడని ఇటీవలే ఒక నివేదిక ప్రకటించింది. షారుఖ్ నటన మాత్రమే కాకుండా నిర్మాతగా, బిజినెస్ మెన్ గా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు షారుఖ్ తనయుడు ఆర్యన్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు.

ఆర్యన్ ఖాన్ వ్యాపారాలు, పెట్టుబడులు

తాజాగా ఓ బాలీవుడ్ నివేదిక ప్రకారం కేవలం ఆర్యన్ ఖాన్ నెట్ వర్త్ 80 కోట్ల పైనే అని సమాచారం. అమెరికాలో, ఇంగ్లాండ్ లో ఫిలిం మేకింగ్, ఫిలిం ప్రొడక్షన్ గురించి కోర్సులు చదివాడు ఆర్యన్. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు కొన్నాళ్ళు. అనంతరం D యావోల్ అనే ఖరీదైన క్లాతింగ్ బిజినెస్ ని స్థాపించాడు. ఇప్పుడు దర్శకుడిగా మారాడు. అంతేకాకుండా మరికొన్ని బిజినెస్ లలో కూడా ఆర్యన్ పెట్టుబడులు పెట్టాడు.

ఆర్యన్ దగ్గర దాదాపు 7.83లక్షలు విలువ చేసే ఖరీదైన వాచ్ ఉంది. ఇటీవలే ఢిల్లీలో 37 కోట్ల విలువ చేసే ఇంటిని కొనుక్కున్నాడు. అలాగే ఆర్యన్ వద్ద ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్ రెండు కార్లు, BMW లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆర్యన్ వయసు ప్రస్తుతం 27 ఏళ్ళు మాత్రమే. ఈ ఏజ్ లోనే ఇంత సంపాదించాడు. ఇదంతా కేవలం ఆర్యన్ సంపాదించింది మాత్రమే. షారుఖ్ కొడుక్కి ఇచ్చేది కలిపితే ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తుంది.

నెట్ వర్త్, లగ్జరీ ఆస్తుల వివరాలు

కెరీర్ ఆరంభంలోనే ఈ రేంజ్ లో తన నెట్ వర్త్ ని పెంచుకుంటున్న ఆర్యన్ ఖాన్ మున్ముందు తండ్రికి తగ్గట్టు వేల కోట్ల ఆస్తులని సంపాదించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

కేవలం 27 ఏళ్ల వయసులో ఆర్యన్ ఖాన్ ఈ స్థాయిలో సంపాదిస్తున్న తీరు ఆశ్చర్యకరం. తండ్రి షారుఖ్ ఖాన్ లాగే వ్యాపార రంగంలో, సినిమా రంగంలో దూసుకుపోతున్న ఆర్యన్ భవిష్యత్తులో వేల కోట్లకు అధిపతి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.