|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇకలేరు! కన్నీటి వీడ్కోలుతో ముగిసిన అంత్యక్రియలు!

Published: 13-04-2026, 9:35 AM
షాకింగ్: లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇకలేరు! కన్నీటి వీడ్కోలుతో ముగిసిన అంత్యక్రియలు!
  • లెజెండరీ సింగర్ ఆశా భోస్లే(92) ఇకలేరు – సంగీత ప్రపంచంలో విషాదం!
  • ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
  • ఆశా భోస్లే భౌతిక కాయాన్ని సందర్శించిన వేలాది అభిమానులు, ప్రముఖులు
  • ఎనిమిది దశాబ్దాల సంగీత ప్రస్థానానికి ముగింపు – ఆమె పాటలు ఎప్పటికీ చిరస్థాయి!

భారతీయ సంగీత ప్రపంచంలో ఒక విషాదకరమైన రోజు. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారు కన్నుమూశారు. ఆమె మరణం సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

ఆశా భోస్లే కన్నుమూత: సంగీత ప్రపంచంలో విషాదం

భారతీయ సంగీత ప్రపంచంలో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే(92) (Asha Bhosle) అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని దాదర్లోని శివాజీ పార్క్ (Shivaji Park) శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, ప్రముఖుల అశ్రుతర్పణల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రయలు ముగిశాయి. ఛాతిలో ఇన్పెక్షన్ కారణంగా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆశా భోస్లే నిన్న తుదిశ్వాస విడిచారు. ఎనిమిది దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతానికి తన గాంత్రంతో వన్నె తెచ్చిన ఆశాభోస్లే భౌతిక కాయాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లోయర్ పారెల్‌లోని ఆమె నివాసంలో ఉంచారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ శ్మశానవాటికకు అంతిమ యాత్ర కొనసాగింది. దారిపొడుగునా వేలాది మంది అభిమానుల చేరి తమ అభిమాన గాయనికి అంతిమ వీడ్కోలు పలికారు. పసుపు రంగు పూలతో అలంకరించిన ఆ శవపేటిక వాహనంపై, సాంప్రదాయ మహారాష్ట్ర ‘నాథ్’ ధరించిన గాయని యొక్క పెద్ద ఛాయాచిత్రాన్ని కూడా ఉంచారు.

ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

వేలాది అభిమానుల కన్నీటి వీడ్కోలు

ఆశా భోస్లే గారి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె పాటలు ఎప్పటికీ మన హృదయాలలో నిలిచిపోతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.