
📌 Key Points
- లెజెండరీ సింగర్ ఆశాభోస్లే కన్నుమూత, సినీ పరిశ్రమలో విషాదం.
- 70 ఏళ్ల సినీ కెరీర్‌లో 12 వేలకు పైగా పాటలు పాడిన ఆశాభోస్లే.
- ఉత్తమ నేపథ్య గాయనిగా రెండుసార్లు నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న ఆశాభోస్లే.
- ఆశాభోస్లేకు 76 అవార్డులు, 88 నామినేషన్లు రావడం విశేషం.
లెజెండరీ సింగర్ ఆశాభోస్లే కన్నుమూశారు. ఆమె వయస్సు రీత్యా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మరణ వార్తతో యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆమె సినీ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆశాభోస్లే మరణం: సినీ పరిశ్రమలో దిగ్భ్రాంతి
Asha bhosle: లెజెండ్రీ సింగర్, మెలోడీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ సంగీత శిఖరం ఆశాభోస్లే ఇకలేరు. గత కొంతకాలంగా ఛాతీ ఇన్ఫెక్షన్ , శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈమె నిన్న రాత్రి సడన్గా గుండెపోటు రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరింది. త్వరగానే ఆమె కోలుకుంటుందని, దయచేసి తమ గోప్యతకు భంగం కలిగించద్దండి అంటూ ఆశాభోస్లే మనవరాలు జానై భోస్లే ఇంస్టాగ్రామ్ వేదికగా విజ్ఞప్తి కూడా చేసింది .త్వరగానే ఆమె ఆరోగ్యంగా తిరిగి వస్తారు అంటూ ధీమా వ్యక్తం చేసింది. కానీ విధి వెక్కిరించింది. సంగీత శిఖరం ఒక్కసారిగా కూలిపోయింది. చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె మరణ వార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. సంగీత ప్రియులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆమె మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు
ప్రముఖ లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ సోదరీగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈమె తన కెరియర్ ప్రారంభంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకోవడానికి ఎంతో శ్రమించింది 1943లో మాఝా బాళ్ అనే మరాఠీ చిత్రంతో మొదలైన ఆమె ప్రస్థానం.. 1950వ దశలో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు మళ్ళింది. ఇక 1952లో వచ్చిన సంగ్ధిల్ సినిమాతో తన స్వరాన్ని దేశవ్యాప్తంగా విస్తరింప చేసి..అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలా తన ప్రయాణం మొదలయింది. తన 70 సంవత్సరాల సినీ కెరియర్లో సుమారుగా 12 వేలకు పైగా పాటలు పాడినట్లు ఒకానొక సందర్భంలో ఆమె స్వయంగా వెల్లడించింది కూడా. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట సేవకు గాను ఎన్నో అవార్డులు ఈమెను వరించాయి..
ఆశాభోస్లే సినీ ప్రస్థానం, అవార్డులు
ఆశాభోస్లే పాడిన పాటలు, విశేషాలు
ఆశాభోస్లే మొత్తం 88 విభాగాలలో నామినేషన్ కాగా.. మొత్తం 76 అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు. వాటిలో ఉత్తమ మహిళ నేపథ్య గాయనిగా 18 నామినేషన్లలో 7 ఫిలింఫేర్ అవార్డులను దక్కించుకోవడం జరిగింది. మొదటి రెండు అవార్డులను 1967 ,69లలో దక్కించుకున్నారు. అలాగే ఉత్తమ నేపథ్య గాయనిగా 1981లో నేషనల్ అవార్డును అందుకున్న ఈమె.. మరోసారి 1987లో కూడా ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది. అలాగే ఉత్తమ మహిళా నేపథ్య గాయని విభాగంలో బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డును హిందీలో మూడు సార్లు , బెంగాలీ భాషలో ఒకసారి అందుకుంది. అలాగే ఆసియా నైటింగేల్, లతా మంగేష్కర్ అవార్డు, స్క్రీన్ వీడియోకాన్ అవార్డు, MTV అవార్డు, ఛానల్ వి అవార్డు, స్క్రీన్ అవార్డు, జీ సినీ అవార్డు తో పాటు 2008లో పద్మ విభూషణ్ అవార్డు, 2011లో ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం, 2012లో మిర్చి మ్యూజిక్ జీవిత సాఫల్య పురస్కారం, 2012లో 18వ వార్షిక కలర్ స్క్రీన్స్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, 2021లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఇలా ఎన్నో అవార్డులను ఆమె దక్కించుకున్నారు.
ఆశాభోస్లే మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె పాడిన పాటలు ఎప్పటికీ మన హృదయాలలో నిలిచిపోతాయి. ఆమె కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.


