|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆశిష్‌ను అలా పిలుస్తావా? మీదంతా చెత్త మాటలు.. నటిపై ఆగ్రహం

Published: 20-06-2025, 7:45 AM
ఆశిష్‌ను అలా పిలుస్తావా? మీదంతా చెత్త మాటలు.. నటిపై ఆగ్రహం

Key Points

1

రియాలిటీ షోలో ఆశిష్ విద్యార్థికి అపూర్వ ముఖిజా గౌరవం ఇవ్వలేదు.

2

అపూర్వ మాట్లాడిన తీరుపై సుధాన్షు పాండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

3

సీనియర్ నటుల గురించి మాట్లాడే విధానంపై విమర్శలు.

రియాలిటీ షోలో వివాదం

గుడుంబా శంకర్‌, పోకిరి, అన్నవరం వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆశిష్‌ విద్యార్థి ( Ashish Vidyarthi ). తెలుగుతో పాటు తమిళ, మలయాళ, బెంగాలీ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక చిత్రాలు చేశాడు. ప్రస్తుతం ద ట్రేటర్స్‌ అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో నటి అపూర్వ ముఖిజ .. ఆశిష్‌కు కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడింది. ఆశిష్‌.. అని ఏకవచనంతో సంభోదించింది.

నీ తీరు బాగోలేదు అంత సీనియర్‌ను పేరు పెట్టి పిలవడమేంటని నటుడు సుధాన్షు పాండే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ద రెబల్‌ కిడ్‌ అపూర్వ ( Apoorva Mukhija )కు ఉన్న వివాదాలు సరిపోవడం లేదా? తను చెడ్డదని చెప్పడం లేదు. ఆమె మంచి అమ్మాయే! తనకు మంచి మనసుంది. కానీ నీ మాటతీరు మాత్రం అస్సలు బాగోలేదు. అదే నీకు చెడుగా మారుతుంది. నీకంటే సీనియర్ల గురించి ఎలా మాట్లాడాలనేది తెలియకపోతే మొత్తం వ్యవహారమే తలకిందులవుతుంది జాగ్రత్త!

సుధాన్షు పాండే ఆగ్రహం

చెత్త మాటలు ఆశిష్‌ విద్యార్థి.. నీకే కాదు నాక్కూడా సీనియర్‌. నా వెనక నిల్చున్నప్పుడు ఆశిష్‌ వెళ్లిపోతే బాగుంటుంది అని మాట్లాడావు. ఆయన నీ చిన్ననాటి స్నేహితుడా? నీ తల్లిదండ్రుల కంటే పెద్దవాళ్లైన సీనియర్ల గురించి ఇలాగేనా మాట్లాడేది? దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? జెన్‌ Zకు ఇదంతా కూల్‌గా అనిపిస్తోంది. కానీ ఇదస్సలు లైట్‌ తీసుకునే విషయం కాదు. ఇవన్నీ చెత్త మాటలు అంటాను. ఈ ధోరణి మన సమాజానికి ఒక శాపం అని చెప్పుకొచ్చాడు. అపూర్వ.. నడానియన్‌ సినిమాలో నటించింది. అలాగే కొన్ని సిరీస్‌లు కూడా చేసింది. సుధాన్షు.. తమిళ, పంజాబీ, హిందీ భాషల్లో అనేక చిత్రాలు చేశాడు. తెలుగులో మన్మథుడు 2లోనూ యాక్ట్‌ చేశాడు. హీరోయిన్‌ మాజీ ప్రియుడిగా నటించాడు.

జెన్ Z తరంపై విమర్శ

సీనియర్ నటులకు గౌరవం ఇవ్వడం ఎంతో ముఖ్యం. యువతరం తమ ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. ఈ వివాదం సమాజానికి ఒక హెచ్చరిక.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.