|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్! ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్?

Published: 06-03-2026, 6:05 AM
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్ ఫిక్స్! ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్?
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ విడుదల తేదీ మార్చి 19కి ప్రీ పోన్!
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో నిర్వహించాలని దర్శక నిర్మాతల నిర్ణయం!
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ ను సంప్రదించిన మేకర్స్!
  • రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా విడుదల తేదీని మార్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

మార్చి 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మొదట మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. కానీ మార్చి 19వ తేదీన విడుదలకు రెడీగా ఉన్న కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. దానితో ఒక్కసారిగా ఈ మూవీ ప్రీ పోన్ అయ్యింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ లో మేకర్స్!

ఈ సినిమాను మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలా ఒక్కసారిగా ఈ సినిమా విడుదల తేదీ వారం ముందుకు రావడంతో మేకర్స్ అందుకు అనుగుణంగా ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను కూడా అందుకు అనుగుణంగా చేయాలని ఈ సినిమా దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ దర్శకుడు అయిన హరీష్ శంకర్, నిర్మాతలు అయిన నవీన్, రవి అందరూ కలిసి పవన్ కళ్యాణ్ ను కలిసి ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు, సినిమా ప్రీ ఫోన్ కావడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనుకున్న తేదీ కంటే ముందుగా నిర్వహించాలని అనుకుంటున్నట్లు చెప్పినట్లు, దానికి పవన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్!

దానితో ఈనెల 16వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా కనిపించనుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ విడుదల దగ్గర పడుతుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.