|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: 18 ఏళ్ల క్రితం స్టోరీతో బన్నీ మూవీ.. అట్లీ సంచలన ట్వీట్ వైరల్!

Published: 08-04-2026, 4:05 AM
షాకింగ్: 18 ఏళ్ల క్రితం స్టోరీతో బన్నీ మూవీ.. అట్లీ సంచలన ట్వీట్ వైరల్!
  • అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘రాకా’ మూవీ.. టైటిల్ పోస్టర్ విడుదల!
  • 18 ఏళ్ల క్రితం నాటి ఆలోచన ‘రాకా’.. స్వయంగా వెల్లడించిన డైరెక్టర్ అట్లీ.
  • నెగిటివ్ షేడ్స్‌లో అల్లు అర్జున్ పోస్టర్.. వైరల్ అవుతున్న రాకా ఫస్ట్ లుక్.
  • భారీ అంచనాలు నెలకొన్న ‘రాకా’ మూవీ.. అట్లీ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్!

అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అల్లు అర్జున్ ‘రాకా’: అట్లీ డ్రీమ్ ప్రాజెక్ట్

Atlee : అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఈ సినిమా టైటిల్ రాకా అని ప్రకటించారు. రాకా టైటిల్ ప్రకటిస్తూ అల్లు అర్జున్ నెగిటివ్ షేడ్స్ లో ఉన్న ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో టైటిల్, పోస్టర్ వైరల్ గా మారాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నెగిటివ్ షేడ్స్‌లో బన్నీ.. పోస్టర్ అదిరింది!

తాజాగా దర్శకుడు అట్లీ ఈ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసారు. అట్లీ తన ట్వీట్ లో.. రాకా కేవలం సినిమా మాత్రమే కాదు. చాలా ఏళ్లుగా నేను దీన్ని మోస్తున్నాను. గత 18 ఏళ్లుగా నేను ఈ ఐడియాని పట్టుకొని ఉన్నాను. ఇది ఎప్పుడూ ఫేడ్ అవుట్ అవ్వదు. ఇది నన్ను టెస్ట్ చేసింది, షేప్ చేసింది, ప్రతి విషయంలో నాతో ఉంది ఈ ఆలోచన. నిజాయితీగా ఇది ఒక ఆరంభం మాత్రమే అని పోస్ట్ చేసాడు.

18 ఏళ్ల నిరీక్షణ.. అట్లీ ట్వీట్ వైరల్!

దీంతో ఇది 18 ఏళ్ళ క్రితం అట్లీ ఆలోచనల్లో వచ్చిన ఐడియా అని తెలుస్తుంది. 18 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ ఐడియా ఇప్పుడు ఎలా తెరకెక్కిస్తాడో అనో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.