
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, ఐకాన్ స్టార్ కాంబోలో AA22 భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. దీనితో పాటు, అట్లీ తన తదుపరి పాన్ ఇండియా చిత్రాన్ని యష్‌తో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబోపై నెటిజన్లు తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నారు.
Key Points
అట్లీ దర్శకత్వంలో ప్రస్తుతం AA22 చిత్రం నిర్మాణంలో ఉంది, దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది.
AA22 తర్వాత అట్లీ, యష్ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు.
యష్‌తో సినిమాపై అట్లీ పరోక్షంగా హింట్ ఇచ్చారు, ఆయన పని తీరు పట్ల గౌరవం ఉందని తెలిపారు.
అట్లీ-యష్ కాంబోపై నెటిజన్లు 'సూపర్' అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అట్లీ తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee), ఐకాన్ స్టార్ కాంబోలో భారీ ప్రాజెక్ట్ ‘AA-22’ రాబోతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అట్లీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘AA22’ షూటింగ్ కంప్లీట్ కాకముందే అట్లీ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని లైన్‌లో పెట్టనున్నట్లు టాక్.
యశ్(Yash) హీరోగా.. ఈ సినిమా రాబోతుండగా.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం అట్లీ హింట్ ఇచ్చారు. ‘‘యష్ సర్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన పట్ల, ఆయన పని తీరు పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. చూద్దాం ఏదైనా జరుగుతుందేమో” అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆ సినిమాపై హింట్ ఇచ్చాడని అంటున్నారు. అలాగే కాంబో అదిరిపోయిందని అంటున్నారు.
యష్‌తో సినిమాపై అట్లీ హింట్
నెటిజన్ల రియాక్షన్.. కాంబో సూపర్!
అట్లీ, యష్ కాంబోలో రాబోయే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఊహించని ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది.


