|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరో కాకుంటే నాన్న సంపాదనతో జల్సా! చంద్రహాస్ సంచలన వ్యాఖ్యలు!

Published: 06-02-2026, 9:05 AM
హీరో కాకుంటే నాన్న సంపాదనతో జల్సా! చంద్రహాస్ సంచలన వ్యాఖ్యలు!
  • యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
  • హీరోగా రాణించకపోతే తండ్రి డబ్బుతో తిని పడుకుంటానన్న చంద్రహాస్.
  • బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రమోషన్లలో చంద్రహాస్ చేసిన కామెంట్స్ వైరల్.
  • భూతులతో పాట పాడినందుకు క్షమాపణ చెప్పేది లేదన్న చంద్రహాస్.

ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హీరో కాకపోతే తన తండ్రి సంపాదనతో హాయిగా తిని పడుకుంటానని ఆయన అన్నారు.

చంద్రహాస్ తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు

Attitude Star Chandrahas: యాటిట్యూడ్ స్టార్ట్ చంద్రహాస్(Chandrahas) ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈయన బుల్లితెర నటుడు ఈటీవీ ప్రభాకర్(Prabhakar) కొడుకుకు అందరికీ ఎంతో సుపరిచితమే. బుల్లితెర పై నటుడుగా ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ను హీరోగా వెండితెరకు పరిచయం చేశారు. ఈయన హీరోగా రాంనగర్ బన్నీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా బరాబర్ ప్రేమిస్తా(Barabar Premistha) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రహాస్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన మాట్లాడే విధానం కూడా విమర్శలకు కారణమవుతోంది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చంద్రహాస్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది ఒకవేళ మీరు కనుక యాక్టర్ కాకపోయి ఉంటే ఏం చేసేవారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు చంద్రహాస్ సమాధానం చెబుతూ.. తన తండ్రి ఇండస్ట్రీలో ఉంటూ బాగా డబ్బు సంపాదించాడు ఆ డబ్బులతో మంచిగా తిని పడుకుంటాను అంటూ చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తండ్రి సంపాదనపై చంద్రహాస్ కామెంట్స్ వైరల్

ఇలా తండ్రి సంపాదించిన డబ్బులతో తిని పడుకుంటాను అంటూ ఈయన కామెంట్ చేయడంతో మరోసారి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటూ ఈయనపై విమర్శలు వస్తున్నాయి. చంద్ర హాస్ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఇలాంటి మాట తీరుతో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు.. ఇకపోతే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చంద్రహాస్ వేదికపై ఒక పాట పాడిన సంగతి తెలిసిందే.

క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదు..

భూతు పాట వివాదంపై చంద్రహాస్ స్పందన

ఈ పాట పెద్ద ఎత్తున భూతులతో ఉన్న నేపథ్యంలో తీవ్రస్థాయిలో ఈ పాటపై విమర్శలు వచ్చాయి. పలువురు హీరోలు కూడా ఈ విషయంలో చంద్రహాస్ తీరును తప్ప పడుతున్నారు. ఈ విధంగా బూతు పదాలతో ఈ జనరేషన్ వారికి ఏమి నేర్పిస్తున్నారంటూ మండి పడుతున్నారు. ఇక ఈ వివాదం పై ఎంతోమంది స్పందిస్తూ చంద్రహాస్ పట్ల విమర్శలు కురిపిస్తున్నప్పటికీ ఈయన మాత్రం తానేమి తప్పుగా మాట్లాడలేదని, ఈ విషయంలో తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు అంటూ తెలియజేశారు. తానేమి తప్పు చేయకపోయినా ఎంతోమంది నన్ను అదే పదాలతో విమర్శలు చేశారు మీ మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి కానీ, నా మనోభావం ఎప్పుడో దెబ్బతినింది అంటూ చంద్రహాస్ ఈ వివాదం పై క్షమాపణలు చెప్పడం పక్కనపెట్టి తన తప్పు లేదంటూ వాదించటం గమనార్హం.

మొత్తానికి చంద్రహాస్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆయన మాటతీరును చాలామంది తప్పుబడుతున్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.