|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Avika Gor: నాకు ఇంటి నుంచి సపోర్ట్ లేదు.. అయినా హీరోయిన్‌గా ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది.. అవికా గోర్ కామెంట్స్

Published: 10-06-2025, 1:31 AM
Avika Gor: నాకు ఇంటి నుంచి సపోర్ట్ లేదు.. అయినా హీరోయిన్‌గా ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది.. అవికా గోర్ కామెంట్స్

బాలనటిగా తన కెరీర్ ప్రారంభించిన అవికా గోర్, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కుటుంబం నుంచి సహకారం లేకపోవడం గురించి మాట్లాడింది. ఆమె విజయం వెనుక ఉన్న కథ ఇది.

Key Points

1

అవికా గోర్ ఇంటి నుంచి సపోర్ట్ లేకుండా సినీ రంగంలో ఎదిగింది.

2

‘చిన్నారి పెళ్లి కూతురు’గా ప్రారంభించి, ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తుంది.

4

ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపింది.

అవికా గోర్ సినీ ప్రయాణం

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అవికా గోర్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది ‘షణ్ముఖ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చన ఈ అమ్మడు.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలు పంచుకుంది. ‘‘చిన్నారి పెళ్లి కూతురు’గా స్టార్ట్ అయినా నా ప్రయాణం ఈస్థాయికి చేరడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ స్థాయిని ఇచ్చిన ప్రతీ ప్రేక్షకుడికి నా కృతజ్ఞతలు. ఎటువంటి అధికారిక శిక్షణ, బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నన్ను ఎంతో ఆదరించారు. కనీసం నా ఫ్యామిలీ నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. అయినా ఈ రోజు ఈ ప్లేస్‌లో నేను ఉన్నాను. దీనికి ఎంతో సంతోషంగా ఉంది. మంచి పాత్రలు వచ్చినప్పుడు బాధ్యతగా నటించి విజయం అందుకునేలా చేయడం ఆర్టిస్టుగా నా బాధ్యత. ఓటీటీ లేదా టెలివిజన్ లేదా సినిమా ఏదైనా సరే నేను ఒకే విధంగా పని చేస్తాను. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని ఒడిదుడుకులను అధిగమించి అనుకున్న స్థాయికి చేరతా’ అని తెలిపింది.

కుటుంబం నుంచి సపోర్ట్ లేకపోవడం

విజయానికి కారణాలు

ఇంటి నుంచి సహకారం లేకున్నా, అవికా గోర్ తన కృషి, అంకితభావంతో సినీరంగంలో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె విజయం ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.