|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Baa Baa Black Sheep: బాబా బ్లాక్ షీప్.. పోస్టర్ రిలీజ్‌ చేసిన టాలీవుడ్ డైరెక్టర్

Published: 01-10-2025, 11:15 AM
Baa Baa Black Sheep: బాబా బ్లాక్ షీప్.. పోస్టర్ రిలీజ్‌ చేసిన టాలీవుడ్ డైరెక్టర్

గుణి మంచికంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాబా బ్లాక్ షీప్’ అనే న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ సినిమా మోషన్ పోస్టర్‌ను టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. గన్స్, గోల్డ్ చుట్టూ తిరిగే ఈ కథలో టిను ఆనంద్, ఉపేంద్ర తదితరులు నటిస్తున్నారు.

Key Points

1

బాబా బ్లాక్ షీప్ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం.

2

గుణి మంచికంటి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

4

టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్ కీలక పాత్రల్లో.

సినిమా నేపథ్యం, కథాంశం

గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట.. ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఓ ఆరుగురి ప్రయాణంతో  న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా బాబా బ్లాక్ షీప్ అనే చిత్రం రాబోతోంది.  ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని  దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియో బ్యానర్‌పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా బా బా బ్లాక్ షీప్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్‌ను చూస్తుంటే.. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథగా ‍అర్థమవుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

నటీనటులు, సాంకేతిక బృందం

మోషన్ పోస్టర్ విడుదల విశేషాలు

దసరా సందర్భంగా విడుదలైన ఈ మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఈ ఆసక్తికర క్రైమ్ కామెడీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.