
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క నటించిన ‘బాహుబలి ది ఎపిక్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం 6 రోజుల్లోనే 50 కోట్లకు పైగా వసూలు చేసి అదరగొట్టింది. సినిమా కలెక్షన్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Key Points
ప్రభాస్, రానా, అనుష్క నటించిన 'బాహుబలి ది ఎపిక్' కలెక్షన్ల సునామీ.
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది.
అక్టోబర్ 31న విడుదలైన సినిమా 6 రోజుల్లో 50 కోట్లకు పైగా వసూలు చేసింది.
'ది బిగినింగ్', 'ది కంక్లూజన్' సినిమాల మిశ్రమంగా రూపొందిన వెర్షన్ ఇది.
బాహుబలి ది ఎపిక్ కలెక్షన్ల రికార్డులు
ప్రభాస్, రానా దగ్గుబాటి హీరో విలన్‌గా, అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్‌గా నటించిన సినిమా బాహుబలి: ది ఎపిక్. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. అక్టోబర్ 31న రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ ఆరు రోజుల్లో ఎన్నో కోట్లు రాబట్టిందో ఇక్కడ తెలుసుకుందాం.
రాజమౌళి తెరకెక్కిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలను కలిపి రూపొందించిన మూవీ ‘బాహుబలి: ది ఎపిక్’. ప్రభాస్ , రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి , తమన్నా భాటియా నటించిన ఈ రీమాస్టర్ వెర్షన్ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది.
ఆరు రోజుల్లో సినిమా వసూళ్లు
ఏ ప్రాంతం నుంచి ఎంతొచ్చిందంటే?
మొత్తం మీద ‘బాహుబలి ది ఎపిక్’ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 6 రోజుల్లో 50 కోట్లు దాటడం సినిమా ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.


