|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Baahubali The Epic : దసరా రోజు బాహుబలి టీమ్ గ్రూప్ ఫోటో వైరల్.. ‘బాహుబలి ఎపిక్’ కోసం పండగ పూట..

Published: 02-10-2025, 7:48 AM
Baahubali The Epic : దసరా రోజు బాహుబలి టీమ్ గ్రూప్ ఫోటో వైరల్.. ‘బాహుబలి ఎపిక్’ కోసం పండగ పూట..

బాహుబలి సినిమా “బాహుబలి ది ఎపిక్” పేరుతో రీ-రిలీజ్ కాబోతోంది. దసరా పండుగ రోజున కూడా ఈ సినిమా పనులు జరుగుతుండగా, రాజమౌళి సహా బాహుబలి టీమ్ అంతా కలిసి దిగిన గ్రూప్ ఫోటో వైరల్‌గా మారింది. మహేష్ బాబు సినిమా పక్కన పెట్టి రాజమౌళి బాహుబలి పనులపై దృష్టి సారించారు.

Key Points

1

"బాహుబలి ది ఎపిక్" రీ-రిలీజ్ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2

దసరా రోజున కూడా "బాహుబలి ది ఎపిక్" పనులు జరుగుతుండగా, టీమ్ రీ-యూనియన్ అయ్యింది.

4

మహేష్ బాబు సినిమా పక్కన పెట్టి రాజమౌళి బాహుబలి రీ-రిలీజ్ పనులపై పూర్తి దృష్టి పెట్టారు.

“బాహుబలి ది ఎపిక్” రీ-రిలీజ్ వివరాలు

Baahubali The Epic : తెలుగు సినీ పరిశ్రమ స్థితిగతులని మార్చిన సినిమా బాహుబలి. ఆ సినిమా వచ్చి పదేళ్లు అవుతుండటంతో రెండు పార్ట్ లను కలిపి ఒకే సినిమాగా రీ రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. బాహుబలి 1 – బాహుబలి 2 లను కలిపి బాహుబలి ఎపిక్ గా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.(Baahubali The Epic )

బాహుబలి ఎపిక్ అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీమ్ అంతా మళ్ళీ బాహుబలి సినిమా మీద వర్క్ చేస్తున్నారు. ఎడిటింగ్ లో కొంత భాగం తీసేసి రెండు సినిమాలను కలిపి దాదాపు 4 గంటల సినిమాగా కట్ చేయనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పనులు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి.

దసరా రోజు బాహుబలి టీమ్ రీ-యూనియన్

Also See : Vishnupriya Bhimeneni : సద్గురు ఆశ్రమంలో యాంకర్ విష్ణుప్రియ.. ఆదియోగి వద్దకు వెళ్లి.. ఫొటోలు..

నేడు పండగ పూట కూడా బాహుబలి ఎపిక్ వర్క్స్ జరుగుతున్నాయి. నేడు దసరా కావడంతో బాహుబలి సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు అంతా ఒకేచోట కలిసి రీ యూనియన్ అయ్యారు. వీరంతా కలిసి గ్రూప్ ఫోటో దిగడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో… రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, శోభు యార్లగడ్డ, కాల భైరవ, సెంథిల్ కుమార్, కార్తికేయ, శ్రీవల్లి తో పాటు మరికొంతమంది సాంకేతిక నిపుణులు ఉన్నారు.

రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ: మహేష్ సినిమా పక్కన పెట్టి..

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాజమౌళిని అభినందిస్తూ మరోసారి విజువల్ వండర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అని అంటున్నారు. రాజమౌళి కూడా బాహుబలి రీ రిలీజ్ మీద బాగానే కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం చేస్తున్న మహేష్ సినిమా కొన్ని రోజులు పక్కన పెట్టి ఈ సినిమా పనులు చూసుకుంటున్నాడు.

Also See : Malavika Mohanan : ఫ్రెండ్స్ తో రాజాసాబ్ భామ దసరా సెలబ్రేషన్స్.. ఫొటోలు..

దసరా పండుగ రోజున కూడా ‘బాహుబలి ది ఎపిక్’ రీ-రిలీజ్ కోసం టీమ్ కృషి చేయడం ప్రశంసనీయం. వైరల్ అయిన గ్రూప్ ఫోటో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాజమౌళి సారథ్యంలో ఈ విజువల్ వండర్ మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.