|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గరికపాటి వ్యాఖ్యలపై యూట్యూబర్ అన్వేష్‌కు బాబు గోగినేని షాకింగ్ మద్దతు!

Published: 03-01-2026, 4:30 AM
గరికపాటి వ్యాఖ్యలపై యూట్యూబర్ అన్వేష్‌కు బాబు గోగినేని షాకింగ్ మద్దతు!
  • మహిళలపై గరికపాటి వ్యాఖ్యలు ఖండించిన యూట్యూబర్ అన్వేష్‌పై సోషల్ మీడియాలో వ్యతిరేఖత.
  • అన్వేష్‌కు హేతువాది, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని మద్దతు ప్రకటించారు.
  • గరికపాటి ఆడ‌వాళ్ల గురించి నీచంగా మాట్లాడారంటూ బాబు గోగినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • బిగ్ బాస్ ఇంట్లో మ‌హిళ‌ల‌ను అస‌భ్యంగా తాకిన వ్య‌క్తి ఉన్నాడని బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు.

గరికపాటి మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్. యూట్యూబర్ అన్వేష్ ఈ వ్యాఖ్యలను ఖండించగా, ఆయనకు వ్యతిరేఖత మొదలైంది. అయితే హేతువాది బాబు గోగినేని అన్వేష్‌కు మద్దతు ప్రకటించి, గరికపాటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు.

అన్వేష్-గరికపాటి వివాదం: సోషల్ మీడియాలో మాట యుద్ధం

యూట్యూబర్ అన్వేష్ వర్సెస్ శివాజీ అండ్ గరికపాటి సపోర్టర్స్ మధ్య సోషల్ మీడియాలో మాట యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. శివాజీ, గరికపాటి మహిళలపై చేసిన కామెంట్స్ ను అన్వేష్ ఖండించాడు. ఈ క్రమంలో అన్వేష్ పై తీవ్ర వ్యతిరేఖత మొదలవ్వగా చాలా మంది ఆయన యూట్యూబ్ ఛానల్‌ను అన్ సబ్ స్క్రైబ్ చేయడంతో పాటు ఇన్ స్టాగ్రామ్ పేజీని అన్ ఫాలో చేస్తున్నారు. కాగా తాజాగా అన్వేష్‌కు హేతువాది, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబుగోగినేని మద్దతు ప్రకటించారు. అన్వేష్ తాను మాట్లాడిన‌దానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని అన్నారు.

యూట్యూబర్ అన్వేష్‌కు బాబు గోగినేని మద్దతు

మాట్లాడిన‌దానికి క్లారిఫికేష‌న్ కూడా ఇచ్చుకున్నార‌ని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉండి మాట్లాడిన అన్వేష్ పై కేసులు పెట్ట‌వ‌చ్చా లేదా అని లాయ‌ర్లు తేల్చాల్సి ఉంద‌న్నారు. గ‌రిక‌పాటి ఆడ‌వాళ్ల గురించి నీచంగా మాట్లాడార‌ని మండిప‌డ్డారు. ఆడ‌వాళ్ల శ‌రీరం చూస్తే త‌న‌కు 50ఏళ్లు దాటినా ఆగ‌లేక‌పోతున్నాన‌ని చెప్ప‌డం నీచ‌మైన భాష అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గరికపాటి గురించి అన్వేష్ మాట్లాడింది నిజమేనని అన్నారు.

బిగ్ బాస్ పై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు

నా అన్వేషణ కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. అందరికీ కోపాలు ఉన్నప్పుడు ఏ భాష మాట్లాడతామనేది ముఖ్యం అన్నారు. అంతే కాకుండా బిగ్ బాస్ షోపై కూడా బాబుగోగినేని కీల‌క వ్యాఖ్యలు చేశారు. తాము బిగ్ బాస్ హౌస్ లో ఉన్న‌ప్పుడు ఓ వ్య‌క్తి ఇద్ద‌రు ముగ్గురు మ‌హిళ‌ల‌ను అస‌భ్యంగా తాకాడ‌ని వాళ్లే వ‌చ్చి త‌న‌కు చెప్పార‌న్నారు. అయితే అత‌డి పేరు చెప్ప‌ను అని అలా చేసిన వ్య‌క్తే మీడియా ముందుకు వ‌చ్చి ఒప్పుకోవాల‌న్నారు.

గరికపాటి వ్యాఖ్యలపై అన్వేష్‌కు బాబు గోగినేని మద్దతు ఇవ్వడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. బిగ్ బాస్ పై చేసిన ఆయన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఈ మొత్తం వ్యవహారం ఇంకా ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.