
📌 Key Points
- చెన్నై లవ్ స్టోరీలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జోడి! యూత్ ఫుల్ లవ్ స్టోరీతో హిట్ కొట్టేందుకు రెడీ!
- బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ నిర్మాతగా మారి.. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది!
- గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో సాయి రాజేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! హీరోయిన్ సెలక్షన్ వెనుక అసలు కథ చెప్పిన డైరెక్టర్!
- ఎస్కేఎన్‌తో జర్నీ నా లైఫ్‌లో తీసుకున్న బెస్ట్ డెసిషన్! కిరణ్ గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది: సాయి రాజేష్
బేబీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి రాజేష్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో నిర్మాతగా వస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సెలక్షన్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చెన్నై లవ్ స్టోరీ: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది!
Director Sai Rajesh About Chennai Love Story Movie: బేబీ సినిమాతో దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ నిర్మాతగా మారి రూపొందించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ, హీరోయిన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సాయి రాజేష్.
హీరో కిరణ్ అబ్బవరం , తెలుగు అందం శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథ అందించిన ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించారు. తాజాగా జరిగిన గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
హీరోయిన్ సెలక్షన్ వెనుక అసలు సీక్రెట్ ఇదే!
“కథ రచయిత దగ్గర నుంచి దర్శకుడి దగ్గరకు వెళ్లి స్క్రీన్ మీదకు వచ్చేసరికి అందులోని ఒరిజినాలిటీ ఎంతో కొంత పోతుంది. కానీ, ఈ సినిమాను నేను అనుకున్నదాని కంటే బాగా తెరకెక్కించాడు రవి నంబూరి” అని సాయి రాజేష్ తెలిపారు.
“నేను బేబి మూవీని ఎంతో ప్రేమించి ఐదు గంటలు తీశాను. 3 గంటలకు ఎలా కుదించాలి అని ఆలోచిస్తున్న టైమ్‌లో రవి వచ్చి హెల్ప్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్‌లోనూ నాతో ఉన్నాడు. కృతజ్ఞతగా రవిని ఈ సినిమా చేయమని రిక్వెస్ట్ చేశా. ఇప్పుడు కూడా ఒక గొప్ప సినిమా చేసి నాకే మంచి చేశాడు రవి. అతను ఎంత ప్రతిభావంతమైన దర్శకుడో తర్వాత మీరంతా చూస్తారు” అని దర్శకుడు సాయి రాజేష్ పేర్కొన్నారు.
కిరణ్ అబ్బవరంతో పనిచేయడం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్: సాయి రాజేష్
“అనంత శ్రీరామ్‌తో వర్క్ చేస్తే లిరిక్స్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన మీద పూర్తిగా ఆధారపడతా. బేబికి ఎంతో మంచి సాంగ్స్ రాశారు. ఆయన పాట రాస్తే ఒకట్రెండు పదాలు మాత్రమే మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక వాక్యం కూడా పూర్తిగా ఛేంజ్ చేయలేదు. ధీరజ్ మంచి ఫ్రెండ్. ఆయన ఈ మూవీని మరింత గ్రాండ్‌గా మీ ముందుకు తీసుకురాబోతున్నారు” అని నిర్మాత సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.
“నేను పూర్తిగా నమ్మి టెన్షన్ లేకుండా వర్క్ చేసుకుంటున్నా అంటే కారణం ఎస్‌కేఎన్. నా లైఫ్‌లో తీసుకున్న మంచి నిర్ణయాల్లో ముఖ్యమైంది ఎస్కేఎన్‌తో జర్నీ. ఈ కథను పూర్తిగా నమ్మి మాతో ట్రావెల్ అయ్యే హీరో కావాలి. క మూవీ తర్వాత కిరణ్ గారు ఒప్పుకున్న సినిమా ఇది. కథ చెప్పిన వెంటనే మీరు ఎలా చెబితే అలా ఈ మూవీ చేద్దామని సపోర్ట్ చేశారు. ఇప్పటిదాకా అలాగే మూవీకి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా చేస్తున్న టైమ్‌లో ఆయనపై మరింత ఇష్టం పెరిగింది” అని సాయి రాజేష్ అన్నారు.
చెన్నై లవ్ స్టోరీ సినిమా గురించి ఎన్నో విషయాలు సాయి రాజేష్ పంచుకున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


