
ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా రీ-రిలీజ్ కానుంది. అక్టోబర్ 31న రెండు పార్టులను కలిపి విడుదల చేయనున్నారు. సినిమా రన్ టైం గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.
Key Points
బాహుబలి 1 & 2 రీ-రిలీజ్ అక్టోబర్ 31న!
రెండు పార్టులను కలిపి 3 గంటల 50 నిమిషాల రన్ టైం!
తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల!
అధికారిక రన్ టైం ప్రకటన త్వరలో!
బాహుబలి రీ-రిలీజ్ తేదీ
ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి (Bahubali ) గ్రాండ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి, బాహుబలి 2 రెండు పార్టులు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ సినిమాలను జక్కన్న చాలా జాగ్రత్తగా తెరపైకి ఎక్కించారు. ఇక ప్రభాస్ హీరోగా చేసిన.. బాహుబలి సిరీస్ లో… రానా, రమ్యకృష్ణ, అనుష్క ఇలా చాలా మంది తోపు నటీనటులు మెరిసి సక్సెస్ అందుకున్నారు.
సినిమా రన్ టైం వివరాలు
కోట్ల వర్షం కొల్లగొట్టిన ఈ సినిమా… ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టులను కలిపి బాహుబలి సిరీస్ ను రీ రిలీజ్ చేయబోతోంది చిత్ర బృందం. ఈ అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం అలాగే హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
భాషల్లో విడుదల
ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. రెండు పార్టులు కలిపి రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ మూవీ రన్ టైం 3 గంటల 50 నిమిషాలకు చేరింది. అంటే ఈ సినిమాకి వెళ్లిన వాళ్లు 3:50 గంటలపాటు థియేటర్లోనే కూర్చోవాలి. అయితే రన్ టైం పైన ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే క్లారిటీ రానుంది.
బాహుబలి రీ-రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.


