
📌 Key Points
- బాలయ్య కెరీర్ లో ఆగిపోయిన మరో సినిమా ఇది!
- 1994లో బాలయ్య పుట్టినరోజునాడు ఘనంగా సినిమా ఓపెనింగ్ జరిగింది.
- బాలీవుడ్ చిత్రం ‘బోల్ రాధా బోల్’ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కాల్సింది.
- కారణాల వల్ల సినిమా షూటింగ్ మొదలవ్వకుండానే ఆగిపోయింది!
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సంచలనాలు. కొన్ని సినిమాలు విడుదలై రికార్డులు సృష్టిస్తే, కొన్ని మాత్రం ప్రారంభోత్సవం జరుపుకొని ఆగిపోయాయి. అలాంటి ఒక సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నిజంగా షాకింగ్ న్యూస్!
బాలయ్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ మిస్!
Balakrishna : స్టార్ హీరోల సినిమాలు గతంలో ఎన్నో ఆగిపోయాయి. ఇప్పటికి కొన్ని సినిమాలు గ్రాండ్ గా మొదలయి పలు కారణాలతో ఆగిపోతుంటాయి. అలా బాలకృష్ణ కెరీర్లో కూడా మొదలయి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. అందులో ఇదొకటి.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఆదిత్య 369 సినిమా భారీ విజయం సాధించింది. ఆ నిర్మాతలకు బాలయ్య ఇంకో సినిమా డేట్స్ కూడా ఇచ్చారు. దీంతో అప్పట్లో ఎంతో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టితో బాలయ్య సినిమా అనుకున్నారు. అప్పటికే రవిరాజా బాలయ్యకు బంగారు బుల్లోడు లాంటి భారీ హిట్ ఇచ్చాడు.
రీమేక్ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి?
దీంతో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో – బాలకృష్ణ హీరోగా శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై 1994 లో బాలయ్య పుట్టిన రోజు జూన్ 10న హైదరాబాద్ లోని లలిత కళా తోరణం వద్ద గ్రాండ్ గా సినిమా ఓపెనింగ్ చేసారు. ఈ ఓపెనింగ్ కి ఫ్యాన్స్ కూడా భారీగా తరలి వచ్చారు. సినిమా ఓపెనింగ్ తర్వాత ఫ్యాన్స్ మధ్యలో బాలయ్య కేక్ కటింగ్ కూడా చేసారు.
బాలీవుడ్ లో రిషి కపూర్ హీరోగా తెరకెక్కిన బోల్ రాధా బోల్ రీమేక్ గా ఈ సినిమా అనుకున్నారు. ఈ సినిమాకు ప్రముఖ కమెడియన్ MS నారాయణ రచయితగా కూడా పనిచేసారు. బంగారు బుల్లోడు తర్వాత అదే డైరెక్టర్ తో సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. కానీ పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వకుండానే ఆగిపోయింది. హిట్ డైరెక్టర్ – హిట్ నిర్మాత – హిట్ హీరో కాంబో అయినా కూడా ఎందుకో ఈ సినిమా ఆగిపోయింది.
ఫ్యాన్స్ కి నిరాశ.. హిట్ కాంబో రిపీట్ అయినా!
దీంతో ఈ సినిమా స్థానంలో బాలయ్య డేట్స్ తో నిర్మాత కృష్ణప్రసాద్ శరత్ డైరెక్షన్లో వంశానికొక్కడు సినిమా తీసి హిట్ కొట్టారు. ఆ తర్వాత రవిరాజా పినిశెట్టి బాలయ్యతో దేవుడు అనే మరో సినిమా చేసారు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది.
ఇలాంటి ఆసక్తికరమైన సినిమా వార్తల కోసం చూస్తూనే ఉండండి. బాలయ్య బాబు సినిమాల గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో అందిస్తాం. అప్పటివరకు వేచి ఉండండి!


