
భారత సరిహద్దులో జరిగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత, నందమూరి బాలకృష్ణ నటించిన ‘విజయేంద్ర వర్మ’ సినిమాలోని ఒక యాక్షన్ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Key Points
ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు.
బాలకృష్ణ 'విజయేంద్ర వర్మ' సినిమాలోని ఓ యాక్షన్ సీన్ వైరల్ అయింది.
ఘని అనే వ్యక్తి ఆ వీడియోను ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఆపరేషన్ సిందూర్ విజయం
భారత సరిహద్దులో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో ఉగ్రవాదులను(Terrorists) జవాన్లు(Jawans) మట్టుబెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకలు వినిపిస్తున్నారు. మన సైన్యంపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. పహల్గాం దాడికి గట్టిగా బదులిచ్చారంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు. అయితే ఓ ట్వీట్ మాత్రం వైరల్ అయింది. నందమూరి బాలకృష్ణ(Nandmuri BalaKrihna) నటించిన ‘విజయేంద్ర వర్మ’ (Vijayendra Varma) సినిమాలోని ఓ వీడియోను ఘని అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్న బాలయ్య.. ఉగ్రవాది(ముఖేష్ రుషి)ని హతం చేశారు. ఉగ్రవాదితో ఫైటింగ్ చేసి హెలికాప్టర్ నుంచి పాకిస్థాన్ ఏరియాలో పడవేస్తూ కాల్చి చంపి డెడ్ బాడిపై జాతీయ జెండాను విసిరివేయడం.. అది రెపరెపలాడటం.. ఆ తర్వాత బాలయ్య సెల్యూట్ చేస్తారు. ఈ దృశ్యంతో కూడిన వీడియోను పోస్టు చేశారు. ‘యస్ వుయ్ విల్ ఎండ్’ అంటూ ట్వీట్ పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బాలయ్య యాక్షన్ సీన్ వైరల్
సోషల్ మీడియాలో ప్రతిచర్య
చివరగా, బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయం, సినిమా దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం ఆసక్తికరమైన సంఘటన.


